Dried Coconut: ఎండిన కొబ్బరితో గుండెకు ప్రయోజనకరం.. బరువు తగ్గడానికి బెస్ట్ ఫుడ్
ఎండిన కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఎండు కొబ్బరి తింటే చర్మాన్ని మృదువుగా, జుట్టును బలంగా, మందంగా మార్చడంలో సహాయపడుతుంది. ఎండిన కొబ్బరిలో ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ప్రేగు కదలిక, మలబద్ధకాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Desiccated Coconut: ఎండిన కొబ్బరిని ఎక్కువగా కూరల్లో, చట్నీ చేయడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా దాని రుచి కోసమే దీన్ని ఇష్టపడతారు. కానీ ఎండు కొబ్బరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని ప్రతిరోజూ తింటే.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. బరువు తగ్గడానికి సాయంత్రం స్నాక్స్‌లా ఎండు కొబ్బరి, వేరుశనగను కలిపి తింటే అనేక ఉపయోగాలు ఉంటాయి. వేరుశెనగ, ఎండు కొబ్బరి తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఎండిన కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో త్వరగా శక్తిని అందిస్తుంది. కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడంతోపాటు.. ఇది జీవక్రియకు మేలు చేస్తుంది. ఎండిన కొబ్బరిలో కార్బోహైడ్రేట్ పరిమాణం తక్కువగా ఉంటుంది. ఇవి శరీర పనితీరుకు అవసరమైన మాంగనీస్, రాగి, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. పోషకాహారం, ఆరోగ్యకరమైన కొవ్వులతో ఎముకల ఆరోగ్యంగా ఉంటాయి. ఎండిన కొబ్బరిలో మాంగనీస్, రాగి వంటి పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఎండిన కొబ్బరిలో ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి ప్రోటీన్‌కు బిల్డింగ్ బ్లాక్‌లుగా పని చేస్తాయి. కణజాలాలను మరమ్మతు చేయడం నుండి హార్మోన్లను ఉత్పత్తి చేయడం వరకు ప్రతిదానికీ అమైనో ఆమ్లాలు అవసరం. రోజూ ఎండు కొబ్బరి తినడం వల్ల శరీరంలోని అవసరమైన ప్రోటీన్ల లోపం తొలగిపోతుంది. ఎండు కొబ్బరి తింటే చర్మాన్ని మృదువుగా, జుట్టును బలంగా, మందంగా మారుతుంది. ప్రతిరోజూ ఆహారంలో ఎండిన కొబ్బరి చేర్చుకుంటే ఫైబర్ లభిస్తుంది. ఇది ప్రేగు కదలిక, మలబద్ధకాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు