Diabetes and walking: వేగంగా నడిస్తే మధుమేహం ముప్పు తగ్గుతుందా?

 Diabetes and walking: వేగంగా నడిస్తే మధుమేహం ముప్పు తగ్గుతుందా?

వేగంతో నడుస్తున్నామనే విషయం ప్రభావం మధుమేహాన్ని ప్రభావితం చేస్తుందని సర్వేలు చెబుతున్నాయి. వాటి గురించి వివరంగా చదివేయండి.

మధుమేహం, రక్త పోటు లాంటి దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారు చాలా మంది రోజూ వాకింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి వ్యాధులు లేని వారు కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాయామాలు, వాకింగ్‌లు, జాకింగ్‌ల్లాంటి వాటిని చేయడం అలవాటుగా చేసుకుంటారు. అయితే అది ఎంత వేగంతో చేస్తున్నారు? అన్న విషయాన్ని బట్టి మధుమేహం ప్రమాదం అంతగా తగ్గుతుందని ఇటీవల జరిగిన పరిశీలనలో తేలింది. ఆ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నడక వేగానికి, మధుమేహానికి సంబంధం:

ఈ అధ్యయనాన్ని ఇరాన్‌కి సంబంధించిన సిమ్నాన్‌ యూనివర్సిటీ మెడికల్‌ సైన్స్‌స్‌ వాళ్లు జరిపారు. వారు ఎంత వేగంగా నడుస్తున్నారు అన్న దాన్ని బట్టి మధుమేహం రిస్క్‌ ఎంత వరకు తగ్గుతుంది అన్న దాన్ని సైంటిఫిక్‌గా తేల్చి చెబుతున్నారు. దీన్ని బట్టి మామూలుగా నడిచే వారు మరింత వేగం పెంచి నడిస్తే మరిన్ని ప్రయోజనాలు పొందుతారని వెల్లడిస్తున్నారు.

సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ వారానికి కనీసం 150 నిమిషాల పాటు నడవడం వ్యాయామాలు చేయడం మంచిదని సిఫార్సు చేస్తోంది. అందువల్ల ఆరోగ్యం బాగుంటుందని చెబుతోంది. అయితే ఇరాన్‌కి సంబంధించిన ఆ యూనివర్సిటీ వారు మాత్రం ఏం చెబుతున్నారంటే.. గంటకు 2.5 మైళ్ల వేగంతో నడవడం వల్ల టైప్‌ 2 డయాబెటిస్‌ రిస్క్‌ భవిష్యత్తులో రాకుండా ఉంటుంది. ప్రతి 0.6 మైళ్ల వేగం పెరుగుతూ ఉంటే అందుకు తొమ్మిది శాతం డయాబెటీస్‌ రిస్క్‌ తగ్గుతూ వస్తుందని తేల్చారు.

సాధారణ నడకతో పోలిస్తే బ్రిస్క్‌ వాకింగ్‌ వల్ల మరింత ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్న సంగతి మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. అందుకనే నడక వేగంపై జరిగిన పది అధ్యయనాల వివరాలని కూడా వీరు పరిశీలించారు. 1999 నుంచి 2022 మధ్య కాలంలో ఈ విషయంపై అమెరికా, జపాన్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ లాంటి దేశాల్లో జరిగిన అధ్యయనాల్ని వీరు పరిశీలించారు

వాటి ప్రకారం గంటకు 3 నుంచి 4 మైళ్ల వేగంతో నడిచే వారిలో 24 శాతం వరకు డయాబెటీస్‌ రిస్క్‌ తగ్గుతోంది. అలాగే గంటకు 4 మైళ్లకు పైగా వేగంగా నడిచే వారిలో 39 శాతం వరకు మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతున్నట్లు వీరి పరిశీలనలో తేలింది. నడక వల్ల ఎక్కువగా లబ్ధిని పొందాలనుకునే వారు నిమిషానికి 87 కంటే ఎక్కువ స్టెప్స్‌ వేయగలగాలని చెప్పారు. అదే మహిళలైతే 100 అడుగుల వరకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *