Demon Pavan Bigg Boss Captain: బిగ్ బాస్ కొత్త కెప్టెన్‌గా ‘ఢమాల్’ పవన్.. రీతూ చేతికి పగ్గాలు.. ప్రేమజంట పంటపడినట్టే

 Demon Pavan Bigg Boss Captain: బిగ్ బాస్ కొత్త కెప్టెన్‌గా ‘ఢమాల్’ పవన్.. రీతూ చేతికి పగ్గాలు.. ప్రేమజంట పంటపడినట్టే

బిగ్ బాస్ హౌస్‌లో ప్రేమజంటగా మారారు డీమాన్ పవన్, రీతూ చౌదరిలు. అయితే కెప్టెన్ అవ్వమని పవన్‌ని కోరింది రీతూ. ప్రేయసి అడిగితే ప్రియుడు కాదంటాడా.. అలా అడిగిందో లేదో ఇలా హౌస్‌కి కెప్టెన్ అయిపోయాడు డీమాన్ పవన్ అలియాస్ ఢమాల్ పవన్. ఈవారం నామినేషన్స్‌లో ఉన్నాడు ఈ ఢమాల్ పవన్. ఇప్పుడు హౌస్‌కి రెండో కెప్టెన్ అయ్యాడు కాబట్టి.. ఈవారం నామినేషన్స్ నుంచి తప్పించుకుంటే మూడో వారంలో కూడా ఢమాల్‌ ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కేసినట్టే.

Bigg Boss 9 Telugu Captain
బిగ్ బాస్ సీజన్ 9 చప్పగా సాగుతోంది. నిజానికి ప్రతి సీజన్ ప్రారంభంలో ఏమీ ఊపు ఉండదు.. మెల్లగా ఊపందుకుంటుంది. కానీ సీజన్ 9 ప్రారంభంలో ఊపందుకుని రెండోవారానికి చతికిలబడిపోయింది. ఎందుకూ అంటే.. కామనర్స్ అంటూ ఓ చెత్త బ్యాచ్‌ని హౌస్‌లోకి తీసుకుని రావడంతో ఆట మొత్తం ఎత్తిపోయింది. నిజానికి ఈ సీజన్‌లో అగ్నిపరీక్షను ఎదుర్కోని బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఈ కామనర్సే టైటిల్ ఫేవరేట్ అని అంతా అనుకున్నారు. కానీ.. కనకపు సింహాసనమున సునకమ్స్ అన్నట్టుగా… ఆరుగురు కామనర్స్ హౌస్‌లోకి వెళ్లారు కానీ.. ఒకర్నిమించి ఒకరు చిరాకు దొబ్బిస్తున్నారు. ఈ కామనర్స్ దెబ్బకి.. టీవీలు కట్టేసే పరిస్థితి రాగా.. ఇప్పుడు ఆ కామనర్స్ నుంచే హౌస్‌కి కెప్టెన్ అయ్యాడు.

అతను ఎవరో కాదు ఢమాల్ పవన్ అలియాస్ డీమాన్ పవన్ . నిన్నటి ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి.. కాళ్లు పట్టుకుని ఈడ్చిపాడేసిన డీమాన్ పవన్.. బిగ్ బాస్ హౌస్‌కి రెండో కెప్టెన్ అయ్యాడు. నాకోసం ఈవారం కెప్టెన్ అవ్వాలి అని ప్రేయసి రీతూ కోరికపై.. నీకోసం ట్రై చేస్తా అని మాటిచ్చాడు ప్రియుడు డీమాన్. బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తరువాత లవర్స్‌గా మారిన ఈ ఇద్దరి కోరికను నెరవేర్చుతూ డీమాన్ పవన్‌ని బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్‌ని చేసేశాడు బిగ్ బాస్.

డీమాన్ కాస్త ఢమాల్.. రీతూని చూసి చొంగకార్చుడే

ఢమాల్ పవనా? వీడెవడో కొత్త రకం పత్తి విత్తనమా? అంటే అగ్నిపరీక్షలో గెలిచిన వచ్చిన డీమాన్ పవనే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తరువాత ఢమాల్ పవన్ అయ్యాడు. డీమాన్ ఏంటయ్యా అని అంటే.. వీక్ నుంచి స్ట్రాంగ్ అయ్యే క్యారెక్టర్ సార్ అని బిగ్ బాస్ స్టేజ్‌పై నాగార్జునతో చెప్పిన డీమాన్ పవన్.. బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తరువాత కామంతో కటకటలాడిపోతూ కనిపిస్తున్నాడు.

రీతూ చౌదరి వెనుక హట్చ్ డాగ్ మాదిరిగా వేరెవర్ యూ గో.. యువర్ నెట్ వర్క్ ఫాలోస్ అన్నట్టుగా రీతూ చౌదరి ఎక్కడికి వెళ్తే అక్కడికి చొంగ కార్చుకుంటూ తిరుగుతున్నాడు. ఆఖరుకి ఆమె అంట్లు తోముతున్నా కూడా వదిలిపెట్టడం లేదు. ఈ ఇద్దరూ కలిసి కసికసి చూపులు పిల్ల చేష్టలతో పిచ్చెక్కిస్తున్నారు. ఎక్కడ సందు దొరికితే ఇద్దరూ కలిసి అక్కడికి దూరిపోతున్నారు. బిగ్ బాస్ హౌస్‌ని లవర్స్ పార్క్‌గా మార్చుకున్నారు. సోఫాలో కూర్చుని చేతుపు పిసుక్కుంటూ.. కామంతో కటకటలాడిపోతున్నట్టుగానే కనిపించారు ఈ ఇద్దరూ. అగ్నిపరీక్షలో ఉన్నప్పుడు గోలూ.. గోంగూర కట్టా అని సోది కబుర్లు చెప్పిన డీమాన్ పవన్ కంటికి ఇప్పుడు రీతూ చౌదరి తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు.

డీమాన్ పవన్ రీతూDemon Pavan Rithu Love

ఆమెను చూసి బక్కెట్ల బక్కెట్లు సొల్లు కార్చుకోవడం తప్పితే వేరే పనే లేకుండా బిగ్ బాస్ హౌస్‌లో పిల్ల నిబ్బా వేషాలు వేస్తున్నాడు. మనోడికి రీతూ సంగతి తెలియదూ అనుకోవడానికి అవకాశమే లేదు. ఆమె ప్రేమాయణం, పెళ్లి, విడాకులు, లాండ్ స్కాంలు ఇవన్నీ తెలిసినవే. ఇవన్నీ తెలిసినా కూడా.. కంటి చూపుతో డీమాన్ పవన్‌ని గుక్క తిప్పుకోకుండా చేస్తుంది రీతూ. దాంతో మనోడు గుటకలు వేసుకుంటూ.. చొంగ కార్చుకుంటూ ఆమె చుట్టూనే ప్రదక్షిణలు చేస్తున్నాడు. మరి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యాడు. అంటే.. రీతూకి కెప్టెన్ పగ్గాలు వచ్చినట్టే. ఎందుకంటే.. నీకోసం ఈవారం కెప్టెన్ అవుతానంటూ రీతూ కళ్లల్లోకి కసికసిగా చూసి మరీ చెప్పాడు డీమాన్. అతను అలా అనుకున్నాడో లేదో.. ఇలా కెప్టెన్‌ని చేసేశారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *