Dandruff: ఉసిరితో చుండ్రు సమస్యకు చెక్‌ పెట్టండి

 Dandruff: ఉసిరితో చుండ్రు సమస్యకు చెక్‌ పెట్టండి

ఉసిరికాయ జుట్టు పెరుగుదలకు, జుట్టుకు సహజమైన షైన్ ఇస్తుంది. ఉసిరి నూనెను తలపై, జుట్టుపై అప్లయ్‌ చేసి మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత జుట్టును నీటితో కడగాలి. ఉసిరి నూనె జుట్టు మూలాలను మృదువుగా, మెరిసేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Dandruff: ఉసిరికాయ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలుసు. ఇది జుట్టును నల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, రియు ఇతర పోషకాలు ఉన్నాయి. ఇది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది మరియు జుట్టుకు సహజమైన షైన్ ఇస్తుంది. దీనితో పాటు, ఆమ్లా జుట్టు నాణ్యతను మెరుగుపరుస్తుంది. జుట్టు సహజ రంగును తిరిగి తీసుకొస్తుంది. ఉసిరికాయను పచ్చిగా లేదా ఎండబెట్టి తినడం జుట్టుకు అలాగే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉసిరికాయను అనేక రకాలుగా తీసుకోవచ్చు. ఉసిరిని జుట్టుకు కూడా పూస్తారు. ఉసిరికాయను జుట్టుకు ఎలా అప్లై చేయాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఉసిరి నూనె:

  • ఉసిరి నూనెను ఉపయోగించవచ్చు. ఉసిరి నూనె మార్కెట్‌లో సులభంగా దొరుకుతుంది. ఉసిరి నూనెను తలపై, జుట్టుపై అప్లయ్‌ చేసి మసాజ్ చేయండి. ముప్పై నిమిషాల తర్వాత జుట్టును నీటితో కడగాలి. ఉసిరి నూనె జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టును బలంగా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఉసిరి పొడి-పెరుగు:

  • ఆమ్లా హెయిర్ మాస్క్‌ని కూడా తయారు చేసి జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. పెరుగు, ఉసిరి రెండూ జుట్టుకు మేలు చేస్తాయి. దీంతో జుట్టు మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది. హెయిర్ మాస్క్ చేయడానికి ఒక గిన్నెలో 2 నుండి 3 చెంచాల ఉసిరి పొడి, 2 చెంచాల పెరుగు, 1 చెంచా తేనె కలపాలి. జుట్టు మూలాల నుండి ఈ ప్యాక్‌ని వేయాలి.  20 నుండి 30 నిమిషాల తర్వాత జుట్టును నీటితో కడగాలి.

ఉసిరి పొడి-తేనె:

  • ఉసిరి పొడి, తేనె మిశ్రమం జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. ఒక గిన్నెలో 2 చెంచాల ఉసిరి పొడి, చెంచా తేనె కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు అప్లై చేయాలి. చివరగా షాంపూతో జుట్టును కడగాలి.

ఉసిరి నీరు:

  • జుట్టు ఆరోగ్యంగా, మెరిసేలా చేయడానికి జుట్టుకు ఆమ్లా నీటిని అప్లై చేయవచ్చు. దీని కోసం ముందుగా ఉసిరికాయను కట్ చేసి నీటిలో ఉడకబెట్టాలి. తర్వాత రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం ఈ నీటిని జుట్టుకు పట్టించాలి. ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది.
  • గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది.  ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *