chicken Prices : చికెన్ షాపులకు ఫుల్ గిరాకీ.. ఇవ్వాళ కేజీ ధర ఎంతంటే..?

 chicken Prices : చికెన్ షాపులకు ఫుల్ గిరాకీ.. ఇవ్వాళ కేజీ ధర ఎంతంటే..?

గణేష్ నవరాత్రులు ముగిశాయి. దీంతో హైదరాబాద్ లో నాన్ వెజ్ షాపులు కళకళలాడుతున్నాయి. మాంసం దుకాణాల వద్ద జనాలు బారులు తీరారు. చికెన్ ధరలు కొద్దిగా పెరిగినప్పటికీ, మటన్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

గణేష్ నవరాత్రులు ముగిశాయి. దీంతో హైదరాబాద్ లో నాన్ వెజ్ షాపులు కళకళలాడుతున్నాయి. మాంసం దుకాణాల వద్ద జనాలు బారులు తీరారు. చికెన్ ధరలు కొద్దిగా పెరిగినప్పటికీ, మటన్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దాదాపుగా పది రోజుల పాటుగా నాన్ వెజ్ వినియోగం తగ్గడంతో వెలవెలబోయిన చికెన్ షాపులు ఇప్పుడు మళ్లీ కళకళలాడుతున్నాయి.

చికెన్ కిలో ధర రూ.220

ఆదివారం మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర రూ.240గా ఉంది. అదే స్కిన్‌తో అయితే చికెన్ కిలో ధర రూ.220గా పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ అధికంగా ఉండటం వల్ల ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారులు కూడా రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు స్టాక్‌ను సిద్ధం చేసుకున్నారు. అటు మటన్ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. నగరంలో మటన్ ధర కిలోకు రూ.950 నుంచి రూ.1000 మధ్య కొనసాగుతోంది. గణేష్ నవరాత్రుల టైమ్ లో  వినియోగం కాస్త తగ్గినప్పటికి ధరల్లో ఎలాంటి మార్పు లేదని వ్యాపారులు అంటున్నారు.

మరోవైపు, చేపల మార్కెట్‌లో కూడా ఆదివారం  సందడి నెలకొంది. బొచ్చ చేప కిలో రూ.200కి, కొర్రమేను కిలో రూ.300 వరకు విక్రయిస్తున్నారు. పండుగ రోజుల్లో నాన్-వెజ్ జోలికి వెళ్లని చాలా మంది ప్రజలు, ఈ ఆదివారం ఆ లోటును తీర్చుకునేందుకు మాంసం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

చికెన్, మటన్ షాపుల రద్దీపై యజమానులు సంతోషం వ్యక్తం చేశారు. గత పది రోజులుగా తమ వ్యాపారం అంతగా లేదు. కానీ ఈ ఆదివారం మళ్లీ ఊపు అందుకోవడం శుభపరిణామం అని అంటున్నారు.ఈ రద్దీని బట్టి చూస్తే, రాబోయే రోజుల్లో కూడా మాంసం వినియోగం పెరుగుతుందని ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *