Charminar : హైదరాబాద్ నడిబొడ్డున దారుణం..విదేశీ మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు..వీడియో వైరల్
Charminar : హైదరాబాద్ నడిబొడ్డున దారుణం..విదేశీ మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు..వీడియో వైరల్
చార్మినార్ వద్ద విదేశీ మహిళపై ఓ యువకుడు అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న చార్మినార్ వద్ద ఇలాంటి వ్యవహారం జరగడం పట్ల నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఇటీవల బోనాలు, వినాయక చవితి నవరాత్రుల సమయంలో మహిళలు, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వందలాది మంది పోకిరీలను షీటీమ్స్ బృందాలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చార్మినార్ వద్ద విదేశీ మహిళపై ఓ యువకుడు అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న చార్మినార్ వద్ద ఇలాంటి వ్యవహారం జరగడం పట్ల నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ప్రకారం హైదరాబాద్ చార్మినార్ వద్ద కొంత మంది స్థానిక యువకులు టీ తాగుతూ ఉన్నారు. అదే సమయంలో ఓ విదేశీ జంట చార్మినార్ అందాలను కెమెరాల్లో రికార్డు చేస్తూ అక్కడ తిరుగుతున్నారు. కాగా, ఆ మహిళను చూసిన ఓ పోకిరి ఆమె శరీర రంగుతో కలుపుతూ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆ వ్యాఖ్యలను పసిగట్టిన విదేశీ మహిళతో ఉన్న ఆమె స్నేహితుడు.. ఆ పోకిరి దగ్గరకు వెళ్లి మర్యాదపూర్వకంగానే బాగున్నారా అంటూ పలకరించాడు. ఆ తర్వాత ‘జాగ్రత్త’ అంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీనికి ఆ పోకిరి కనీసం ప్రశ్చాత్తపం చూపకుండా ‘ఓకే బ్రదర్’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఈ ఘటనను వారి సదరు వ్యక్తి కెమెరాల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయింది.
కాగా, ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు ఆ యువకుల మీద ఫైర్ అవుతున్నారు. దేశం దేశం పరువు తీస్తున్నారు కదరా.. అంటూ దుమ్మెత్తిపోయడంతో పాటు, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పోకరీపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్‌లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక పలువురు తెలంగాణ పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు ఈ వీడియోన పంపడంతో ఆయన వెంటనే స్పందించారు. సీపీ సజ్జనార్ వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీసులకు ఆదేశాలిచ్చారు. పోలీసులు వీడియో ఆధారంగా పోకిరీలను గుర్తించి పట్టుకునేందుకు వారి కోసం వేట సాగిస్తున్నారు.