Central Bank: సెంట్రల్ బ్యాంకులో 484 ఉద్యోగాలు.. 10వ తరగతి పాసైతే చాలు.. రూ.28,145 వరకూ జీతం

 Central Bank: సెంట్రల్ బ్యాంకులో 484 ఉద్యోగాలు.. 10వ తరగతి పాసైతే చాలు.. రూ.28,145 వరకూ జీతం

Central Bank of India : బ్యాంక్‌ ఉద్యోగాలు కోరుకునే వారికి గుడ్‌న్యూస్‌. 10వ తరగతి అర్హతతో 484 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వివరాల్లోకెళ్తే..

ప్రధానాంశాలు:

  • సెంట్రల్‌ బ్యాంక్‌ రిక్రూట్‌మెంట్‌
  • 484 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
  • 10వ తరగతి పాసైన వాళ్లు అర్హులు
  • Central Bank of India Recruitment 2023 : ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India).. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్- దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 484 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవచ్చు. జనవరి 9వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి. (APPSC : ఏపీ ప్రభుత్వం మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం పోస్టులు, అర్హతల వివరాలివే)

    మొత్తం పోస్టులు: 484

    • జోన్ల వారీగా ఖాళీలు: అహ్మదాబాద్- 76, భోపాల్- 38, దిల్లీ- 76, కోల్‌కతా- 2, లఖ్‌నవూ- 78, ఎంఎంజడ్‌వో & పుణె- 118, పట్నా- 96 పోస్టులున్నాయి.
    • అర్హత: ఎస్‌ఎస్‌సీ/ పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
    • వయసు: 31.03.2023 నాటికి 18 – 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్ల, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
    • పే స్కేల్: నెలకు రూ.14,500- రూ.28,145 ఉంటుంది.
    • ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష(70 మార్కులు), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్(30 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష ఆంగ్ల మాధ్యమంలో ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ అరిథ్‌మెటిక్‌, సైకోమెట్రిక్ టెస్ట్(రీజనింగ్) అంశాల్లో ప్రశ్నలుంటాయి.
    • దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ.850గా నిర్ణయించారు.
    • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *