BRSలో ఆ 20మంది ఔట్‌..20

 BRSలో ఆ 20మంది ఔట్‌..20

ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ పై గురిపెట్టారు. ప్రతిపక్షాలకంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించేందుకు
సిద్ధమైయ్యారు. బీఆర్ఎస్ తోలి జాబితా విడుదలకు రంగం సిద్ధమైంది . నియోజక వర్గాల్లో అసంతృప్తిని
మూటగట్టుకున్నవారితో పాటు ప్రజల్లో పట్టును సాధించిన వారిని పక్కన పెడుతున్నారు . సమర్ధులకే టికెట్ ఖరారు
చేస్తున్నారు. పబ్లిక్ పల్స్ కు అనుగుణంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు . తుది జాబితా ఫైనల్ దాదాపుగా పూర్తి
ఐయ్యింది . ముఖ్యమంత్రి కేసిఆర్ తన అభ్యర్ధన ఎంపికలో తన మార్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాదాపు
20 నుంచి 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెడుతున్నారు . వారికీ ఇప్పటికే పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది.
పార్టీకి విధేయులుగా ఉంటూ క్షేత్ర స్థాయిలో బలం తగ్గినవారికి సీటు ఈయక పోయిన ప్రత్యామ్నాయం కలిపిస్తామని
హామీ ఇస్తుంది .

గెలుపే ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది . అధికారమే లక్ష్యంగా నిర్ణయాలు తీస్తుకుంటామని స్పష్టం
చేస్తోంది . ఈ క్రమం లో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య … జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డి ని తప్పించి
కడియం శ్రీహరి , పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఈయడం ఖాయంగా కనిపిస్తోంది . ఉప్పల్ లక్ష్మ రెడ్డికి టికెట్ ఇస్తామని
కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసారు . చివరిగా బొంతు రాంమోహన్ పేరు తెరమీదకి వచ్చింది. ఈసారి సిట్టింగ్ ల మార్పు
ఖాయమని నియోజకవర్గాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి .

పూర్వ వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్… జనగామ …వరంగల్ తో పాటు పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలోని
కల్వకుర్తి, నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ , కోదాడ , మునుగోడు .. కరీం నగర్ జిల్లాలోని వేములవాడ , రామగుండం ,
జగిత్యాల , కోరుట్ల .. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ , బెల్లంపల్లి , ఖానాపూర్ .. ఖమ్మం జిల్లాలోని వైరా ,
కొత్తగూడెం , ఇల్లందు ఉన్నట్టు తెలుస్తోంది . ఉమ్మడి మెదక్ జిల్లాలో నర్సాపూర్, జకీరాబాద్ నియోజకవర్గాలు
ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది

గ్రేటర్ హైదరాబాద్ లోని ఉప్పల్ , ముషీరాబాద్ , అంబర్ పేట లోను కొత్త ముఖాలే రానున్నాయి . మంత్రులు
కేటీఆర్ ,హరీష్ రావు ఎమ్మెల్సీ కవిత ఎవరికీ వారు తమ వారికీ టికెట్ లు ఈయాలని కోరుతుండటంతో వారు
ప్రతిపాదించిన అభ్యర్థుల బల బలాలపై కూడా అధినేత సర్వే లు చేయిస్తున్నారు . మెదక్ లోని నర్సాపూర్ ఎమ్మెల్యే
చిలుముల మదన్ రెడ్డి స్థానంలో మాజీ మంత్రి సునీత లక్ష్మా రెడ్డి , ఆదిలాబాద్ జిల్లా లోని ఆసిఫాబాద్ లో కోవా లక్షి ,
ఖానాపూర్ లో కేటీఆర్ బాల్య మిత్రుడు భూక్యా జాన్సన్ నాయక్ కు , వేములవాడ స్థానం లో
చలమాణ లక్ష్మీ నరసింహా రావు కు వరంగల్ తూర్పు బరిలో నన్నపనేని నరేంద్ర స్థాయిలో M.T.వరదరాజు రవి చంద్రకు ,

రామగుండం లో కోరుకంటి రవి చంద్రకు బదులుగా సింగరేణి కార్మిక నేత మరో మహిళా నేత పేరు పరిశీలిస్తున్నట్టు
సమాచారం . పట్నం మహేంద్ర రెడ్డి తాండూర్ టికెట్ కోసం గట్టిగా పట్టుబడతుండటంతో వచ్చే టర్మ్ లో
మంత్రి పదవి ఇస్తామని ఆయనకు సీఎం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది . చెన్ననేని రమేష్ కు కూడా ఎమ్మెల్సీ గా ఛాన్స్
ఈయనున్నారు . వారసులకు సీట్లు విషయంలో కేసీఆర్ తిరస్కరించి నట్టు సమాచారం

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *