BRSలోకి జంప్ చేయనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి… జగ్గారెడ్డి..?

 BRSలోకి జంప్ చేయనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి… జగ్గారెడ్డి..?

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇతర పార్టీల్ని బలహీనం చేసేందుకు ఏదో ఓ మాస్టర్
ప్లాన్ వేస్తూనే ఉంటారు. బీజేపీపై ఆయన ఇప్పటికే బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. బీజేపీ విలవిల్లాడుతోంది. ఇక
మిగిలింది కాంగ్రెస్ . కాంగ్రెస్ పైనా ఆయన కొత్త అస్త్రం ప్రయోగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లను దూరం చేయడం
ద్వారా పొలిటికల్ గేమ్ ఆడాలనుకుంటున్నారు. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. ఉత్తమ్ కమార్ రెడ్డి,
జగ్గారెడ్డి బీఆర్ఎస్‌లో చేరుతారని దాదాపుగా అన్ని పార్టీల నేతలూ అంటున్నారు. దానికి ముహుర్తం దగ్గర పడిందని
బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

టీ పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండాలనుకోవడం లేదు. ఎవరో ఉరూ పేరూ లేని వాళ్లు
ఉత్తమ్ పార్టీ మారుతున్నారని ప్రచారం ప్రారంభించగానే.. ఆయన దీని వెనుక తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేత
ఉన్నారని.. హైకమాండ్ చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేస్తూ తెర ముందుకు వస్తున్నారు. ఆయన
తీరు చూస్తే.. బీఆర్ఎస్‌లో చేరిపోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి తొందరపడుతున్నారని ఎవరికైనా అర్థమవుతుంది.
జగ్గారెడ్డి… ఉత్తమ్‌కు అత్యంత సన్నిహితుడు. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూంంటారు. రేవంత్ పీసీసీ చీఫ్
అయినప్పటి నుండి ఆయనకు కాంగ్రెస్ లో ఉక్కపోతగానే ఉంది. ఓ సారి తాను కాంగ్రెస్ పార్టీ సభ్యుడి కాదని కూడా
చెప్పుకున్నారు.కేసీఆర్ వీరితో చర్చలు పూర్తి చేశారని.. సరైన సమయం చూసి బీఆర్ఎస్‌లో చేర్చుకుంటారని
అంటున్నారు. :

సీనియర్లను చేర్చుకుని కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు కానీ. వారి చేరిక వల్ల తమ పార్టీకి
డ్యామేజ్ అవుతుందన్న ఆలోచన చేయడంలేదని బీఆర్ఎస్ నేతలు గొణుక్కుంటున్నారు. కాంగ్రెస్ దరిద్రాన్ని
తెచ్చుకుని మన నెత్తిపై పెట్టుకోవడం ఎందుకనేది ఎక్కువ మంది వాదన. నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్
చేసింది. కాంగ్రెస్ కు ఒక్క సీటు లేదు. ఇలాంటి సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని చేర్చుకుని ఆయనకు..
ఆయన భార్యకు టిక్కెట్లు ఇవ్వడం వల్ల తెలంగాణ బీఆర్ఎస్ మొత్తం డిస్ట్రర్బ్ అవుతుందని..
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక జగ్గారెడ్డిని చేర్చుకుని కొత్తగా తెచ్చుకునే బలం ఏమిటన్న వాదన ఉంది. కాంగ్రెస్ ను బలహీనం చేయడానికి
అక్కడి నేతల్ని తీసుకుని … తమ పార్టీని వర్గ పోరాటంలోకి నెట్టేసుకుంటున్నారన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది
వినిపిస్తోంది. రాజకీయాల్లో తాము బలపడటం కన్నా ఒక్కో సారి ప్రత్యర్థిని బలహీనపర్చడం గొప్ప వ్యూహం
అవుతుంది. కానీ ప్రత్యర్థిపై ఇలాంటి ప్లాన్ అమలు చేసే ముందుకు తమకు ఎఫెక్ట్ అవుతుందేమో పరిశీలించకపోతే…
తమ వ్యూహం తమకే బూమరాంగ్ అవుతుంది. కాంగ్రెస్ సీనియర్ల విషయంలో కేసీఆర్ ప్లాన్ అలాంటిదేనని
బీఆర్ఎస్ నేతలు కంగారు పడుతున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *