Breaking News : తెలంగాణలో యూరియా కొరత.. కలెక్టర్‌ పై కేసు నమోదు?

 Breaking News : తెలంగాణలో యూరియా కొరత.. కలెక్టర్‌ పై కేసు నమోదు?

మహబూబాబాద్ లోయూరియా కోసం..అజ్మీరా లక్య అనే వృద్ధ రైతు క్యూ లైన్‌లో నిలబడి, సొమ్మసిల్లి పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఘటనపై  తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. ఆ జిల్లా కలెక్టర్‌ అద్వైత్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించింది.

Breaking News : గత కొన్ని రోజులుగా తెలంగాణలో రైతన్నలు యూరియా కొరతను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు  వర్షాలు పడుతోన్న వేళ అన్నదాతలు యూరియా కోసం అన్ని పనులను వదిలేసి పీఏసీఎస్‌ ల ఎదుట ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు పడుతున్నారు. ఎక్కడ చూసిన ప్రతిరోజు కూడా యూరియా కోసం రైతులు ఆధార్ కార్డులు, చెప్పులను క్యూలైన్ లలో పెట్టి మరీ తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం యూరియా సమస్య పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరోకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. దీనిపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం తమకు రైతులపై అంటే చిత్త శుద్ది ఉందని, తొందరలోనే యూరియా కొరతను అధిగమనిస్తామని, ప్రతి ఒక్కరైతుకు సరిపడా యూరియాను పంపిణి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం

అయితే  ఇటీవల మహబూబాబాద్ లోయూరియా కోసం..అజ్మీరా లక్య అనే వృద్ధ రైతు క్యూ లైన్‌లో నిలబడి, సొమ్మసిల్లి పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత ఎంత దారుణంగా ఉందో అందరికి తెలిసిలా చేసింది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ ఘటనపై  తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. ఆ జిల్లా కలెక్టర్‌ అద్వైత్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. ఈ క్రమంలో మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేయడంతో మహబూబాబాద్ పోలీసులు కలెక్టర్ అద్వైత్ కుమార్ పై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై తమకు పూర్తి నివేదిక ఇవ్వాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ పోలీసులను ఆదేశించింది.ఈ క్రమంలో ఒక కలెక్టర్ పై కేసు నమోదు చేయడం ప్రస్తుతం తెలంగాణలో సంచలనంగా మారింది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *