BREAKING: పోసానిపై కేసు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం

 BREAKING: పోసానిపై కేసు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం

పోసాని కృష్ణ మురళికి షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు.

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే పోసాని కృష్ణ మురళి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయనకు ఈసారి షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై.. ఆయన కుటుంబంపై పోసాని కృష్ణమురళి అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని.. పోసానిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాజమహేంద్రవరం జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారు ఆ జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోసాని ఇష్టానుసారంగా.. అనేక సార్లు పవన్ కళ్యాణ్ తో సహా ఆయన కుటుంబ సభ్యులను, జనసేన కార్యకర్తలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో దూషణలు చేశారని.. అయితే పోసానిపై ఫిర్యాదు చేసినా.. వైసీపీ ప్రభుత్వ అండతో పోలీసులు పట్టించుకోలేదని ఎస్పీకి చెప్పారు. పోలీసుల తీరుపై తాము కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా.. ఇప్పటి వరకు పోసాని పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. కాగా ఇప్పటికైనా పోసానిపై తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు.

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ హైకోర్టు ఆశ్రయించారు. గుంటూరు పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం చంద్రబాబు, లోకేష్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. వైసీపీ సోషల్‌ మీడియా పూర్వ ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి వేసిన పిటిషన్ పై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టనుంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *