Brahmamudi September 22nd Episode: బ్రహ్మముడి సీరియల్.. రాజ్‍పై రౌడీలతో అటాక్.. రుద్రాణి ప్లాన్ సక్సెస్.. షర్మిలా డైలాగ్

Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‍లో కావ్య ఇంటికి రాజ్ వెళ్తాడు. అక్కడ కావ్యకు ఆలస్యం కావడంతో అక్కడే ఉండిపోతాడు. అది తెలిసి అపర్ణ రగిలిపోతుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 22వ తేది ఎపిసోడ్‍లో..
బ్రహ్మముడి సీరియల్ నేటి (సెప్టెంబర్ 22) ఎపిసోడ్‍లో కృష్ణమూర్తిని చితకబాది విగ్రహాలు ఎత్తుకెళ్తారు రౌడీలు. రక్తంతో, గాయాలతో కృష్ణమూర్తి పడిపోయి ఉంటాడు. బంటి చెప్పడంతో రాజ్, కావ్య, అప్పు, కనకం అంతా కార్ఖానాకు వస్తారు. తండ్రిని చూసి షాక్ అవుతారు.
మనం కష్టపడి చేసిన విగ్రహాలు అన్ని ఎత్తుకెళ్లారు అని కృష్ణమూర్తి చెబుతూ బాధపడతాడు. మనం బంటి చెబితే ఇక్కడికి వచ్చాం. మనం వచ్చేదారిలో డీసీఎం వ్యాన్ ఎదురు అయింది. అందులోనే విగ్రహాలను తీసుకుని వెళ్లారు అని రాజ్ అంటే… నాకు మీరు తప్పా వేరే దారి అని కావ్య అంటుంది. తప్పకుండా పట్టుకుంటాను అని రాజ్ బయలుదేరుతాడు.