Bindi on Forehead: నుదిటిపై బొట్టు వల్ల ఇన్ని లాభాలా.? సైన్స్ ఏమి చెబుతుందంటే.?

మీరు గుడికి వెల్లప్పుడు లేదా ఏదైన పూజ పూజ చేసుకున్నప్పుడు బొట్టు పెట్టుకొనే ఉంటారు. అయితే నుదిటిపై ధరించే బొట్టు కేవలం మతపరమైన లేదా సాంస్కృతిక చిహ్నం మాత్రమే కాదు, దీనికి శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి కనుబొమ్మల మధ్య ప్రాంతం బొట్టు పెట్టుకొంటే ప్రయోజనాలు ఏంటి.? ఈరోజు తెలుసుకుందాం..
ఒక మనిషి మంచిగా రెడీ అయి బయటకు వెళ్లిప్పుడు చాల మంది చూస్తుంటారు. దీంతో వారికీ నరదిష్టి తగులుతుంది. గుండ్రంగా బొట్టు పెట్టుకొంటే ఇది జరగదు. దీంతో నరదిష్టి సమస్యలు రావని పండితులు చెబుతున్నారు.
నుదిటిపై పెట్టె కుంకుమ బొట్టులో సూర్యరశ్మిని ఆకర్శించే శక్తి కారణంగా శరీరానికి విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. దీంతో ఎలాంటి విటమిన్ డి లోపం లేకుండా ఆరోగ్యం జీవిస్తారు. అందుకే మన పెద్దలు బొట్టు పెట్టుకోమని చెబుతారు.
శరీరంలోని ప్రధాన శక్తి కేంద్రమైన అజ్ఞ చక్రం కనుబొమ్మల మధ్య స్థానంలో ఉంటుంది. ఇక్కడ బొట్టు పెట్టుకొని దీన్ని ఉత్తేజపరచడం వలన అంతర్ దృష్టి, మానసిక స్పష్టత మెరుగుపడుతుందని భావిస్తారు. బొట్టు శరీర శక్తిని సమతుల్యం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించడానికి, ఏకాగ్రతను పెంచడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కనుబొమ్మల మధ్య ప్రాంతం ఒక ప్రధాన పీడన బిందువు. ఇక్కడ బొట్టు పెడితే రక్త ప్రసరణ పెరిగి నరాల ప్రేరణను మెరుగుపరుస్తుంది. నుదిటిపై తరుచు బొట్టు పెట్టుకోవడం వల్ల స్త్రీ, పురుషులు ఇద్దరికి నరాల సమస్యలు రావని శాస్త్రం చెబుతుంది.
కొన్ని సంప్రదాయాలు బొట్టు శరీరంలో శక్తి ప్రవాహాన్ని స్థిరీకరించడం ద్వారా దృష్టి, చర్మ ఆరోగ్యం, వినికిడిని కూడా మెరుగుపరుస్తుందని సూచిస్తున్నాయి. బొట్టు తేలికపాటి ఒత్తిడిని కలిగిస్తుందని, ఇది తలనొప్పి, సైనస్ నుంచి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు.
ఆయుర్వేద వైద్యంలో, కనుబొమ్మల మధ్య ప్రాంతం ఒక ముఖ్యమైన శక్తి బిందువుగా పరిగణిస్తారు. ఇక్కడ బొట్టు పూయడం వల్ల శరీర శక్తిని సమన్వయం చేయడంలో, మొత్తం శ్రేయస్సును ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.