Bigg Boss Telugu: ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ.. గుడ్డు కోసం అలక.. చెప్పుతో కొట్టుకోవాలంటూ!

 Bigg Boss Telugu: ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ.. గుడ్డు కోసం అలక.. చెప్పుతో కొట్టుకోవాలంటూ!

Bigg Boss 7 Telugu Day 93 Episode Highlights: బిగ్ బాస్ 7 తెలుగు ఉల్టా పుల్టాగానే సాగింది. ఈ సీజన్ మరో రెండు వారాలు ఉండగా హౌజ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ముగ్గురు గుడ్డు కోసం ఫైట్ చేసుకోవాల్సి వచ్చింది. చెప్పుతో కొట్టుకోవాలంటూ మాటలు అనుకున్నారు.

బిగ్ బాస్ తెలుగు: ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ.. గుడ్డు కోసం అలక.. చెప్పుతో కొట్టుకోవాలంటూ!

Bigg Boss 7 Telugu December 5th Episode: బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‌లో స్పై, స్పా అని రెండు గ్రూప్స్ ఉన్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఈ రెండు గ్రూపులకు పడదు. నామినేషన్స్ ఇచ్చిపుచ్చుకుంటూ అరుచుకుంటారు. అలాంటిది తమ గ్రూప్‌లోనే ఈసారి గొడవ జరిగింది. స్టార్ మా బ్యాచ్‌గా పేరు తెచ్చుకున్న శోభా శెట్టి, ప్రియాంక, అమర్ (SPA) మధ్య గొడవ జరిగింది. బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఈ ముగ్గురు ఇలా గొడవ పడటం ఇదే తొలిసారి.

కాలితో తన్నిన అమర్

బిగ్ బాస్ 7 తెలుగు డిసెంబర్ 5వ తేది ఎపిసోడ్‌లో అమర్ప్రియాంక పక్క పక్కనే కూర్చుని ఉన్నారు. ఇంతలో శోభా శెట్టి తన టెడ్డీ బేర్ బొమ్మ పట్టుకుని వచ్చింది. హాయ్ అమర్ అంకుల్. ఇదిగే అమర్ అంకుల్‌కు కిస్ ఇవ్వు. పంచ్ ఇవ్వు అంటూ తన టెడ్డీ బేర్‌ బొమ్మతో అమర్‌ను కొట్టింది శోభా. దాంతో సరదాగా ఆ బొమ్మను కాలితో తన్నాడు అమర్. ఏంట్రా కాలితో తంతున్నావ్ అంటూ ప్రియాంకకు బొమ్మ ఇచ్చి వెళ్లిపోయింది శోభా.

సీరియస్‌గా అమర్

అనంతరం ఏమైందో తెలియదు కానీ, ప్రియాంకను పిడికిలితో సరదాగా గుద్దాడు అమర్. అప్పుడు ప్రియాంక దిండు తీసుకుని అమర్ ముఖంపై కొట్టింది. వెంటనే కోపం తెచ్చుకున్న అమర్ టెడ్డీ బేర్‌ను విసిరిపడేసి.. తగులుతుంది.. పిచ్చా ఏమైనా మీకు. మూతి మీద కొడతారేంటీ. ముక్కు మీద జోకా.. అంటూ సీరియస్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాంతో ప్రియాంక, శోభా హర్ట్ అయ్యారు. వాళ్లు చేస్తే ఓకే మనం చేస్తే కాదు. నన్ను పిడికిలితో కొట్టాడురా. అది చాలా గట్టిగా తాకుతుంది అని శోభాతో ప్రియాంక అంది.

విలువ లేదు

కాసేపటికి అమర్ తిరిగి వస్తే.. అక్కడి నుంచి ప్రియాంక, శోభా ఇద్దరు లేచివెళ్లిపోయారు. హో.. ఇద్దరు అలిగారా. వాళ్లకే అంత ఉన్నప్పుడు నాకేంటీ అని పక్కనే ఉన్న అర్జున్‌తో అమర్ అన్నాడు. వాళ్లకే ఏంటీ, నీకు ఎందుకుంత అంటూ ప్రియాంక ఫైర్ అయింది. ఏమన్నాను. ప్రతిదానికి అలిగి వెళ్లిపోతే ఏంటీ. మీకు అంత అడ్డమే అయితే మాట్లాడకండి. బొమ్మను విసిరినందుకు కూడా మాట్లాడకుండా ఉంటారా. బొమ్మలకి ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వడం లేదు అంటూ ఏదేదో అంటాడు అమర్.

నీలాగే సరుక్ మంది

మనసులో ఏదో పెట్టుకుని మాతో అలా మాట్లాడకు. సారీ అమర్ గారు అని ప్రియాంక అంది. దీంతో ఓవర్ చేయకు ప్రియాంక. చేయాల్సిన పనులు స్ట్రయిట్‌గా చేయవని అమర్ అన్నాడు. లాస్ట్ వీక్ గురించి ఎందుకు ఇప్పుడు తీస్తున్నావ్. ఎవరి కోసం ఎంత చేసిన జీరో.. ఛీ అని ఫైర్ అయింది. శోభా కూడా అమర్‌పై సీరియస్ అయింది. ఇందాకా ఎందుకు లేచి వెళ్లావ్. నీకు ఎలాగా సరుక్ మనిందో నువ్ లేచి వెళ్తే మాకు అలాగే సరుక్ మంది. ఇక్కడ అసహ్యం లేదు. చిన్న మ్యాటర్‌ను పెద్దది చేశావ్. నీకు ఏందో మా ఇద్దరితో గొడవ పెట్టుకోవాలని అనుకున్నావ్ అంతే అని శోభా గట్టిగా ఇచ్చేసింది.

చెప్పుతో కొట్టుకోవాలి

నువ్ కొత్తవి తీయకు శోభా. ఇలాంటి స్టేట్‌మెంట్స్ పాస్ చేయకు. చెండాలంగా ఉంటుంది అని అమర్ అన్నాడు. అదంతా చూస్తున్న అర్జున్.. ఏరా మీ ముగ్గురికి టైమ్ పాస్ కాలేదా అని కౌంటర్ వేశాడు. కాసేపటికి ప్రియాంక, శోభా దగ్గరికి వెళ్లి అమర్ మాట్లాడాడు. నేను చేసిన దానికి, నీకు ఆ 140 పాయింట్స్ ఇప్పించినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని ప్రియాంక అంది.

గుడ్డు కోసం

తర్వాత వెంటనే అమర్ నవ్వుతూ మాట్లాడేసరికి ఇంకోసారి గుడ్డును (టెడ్డీ బేర్ బొమ్మ) ఏమన్నా అంటే ఊరుకోం అని ప్రియాంక, శోభా అన్నారు. అలా గుడ్డు అనే టెడ్డీ బేర్ బొమ్మ వల్ల ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఫైట్ చేసుకున్నారు. అనంతరం మళ్లీ కలిసి నవ్వుకుంటూ ఉన్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *