Bigg Boss 9 Telugu Updates: బిగ్ బాస్ హౌస్‌లో ‘బేబీ’ సినిమా చూపిస్తున్న రీతూ చౌదరి.. పవన్‌లు ఇద్దరితోనూ ప్రేమాయణం.. పిల్లగాళ్ల జీవితాలు ఫసక్

 Bigg Boss 9 Telugu Updates: బిగ్ బాస్ హౌస్‌లో ‘బేబీ’ సినిమా చూపిస్తున్న రీతూ చౌదరి.. పవన్‌లు ఇద్దరితోనూ ప్రేమాయణం.. పిల్లగాళ్ల జీవితాలు ఫసక్

బయట అవకాశాల్లేక పిల్లగాళ్లు రోడ్ల వెంట తిరుగుతున్నారు. ఆ బిగ్ బాస్ పుణ్యమో పాపమో తెలియదు కానీ.. సామాన్య యువకుల్ని కొంతమందిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ అవకాశాన్ని ఇచ్చారు. హౌస్‌లోకి అడుగుపెట్టేవరకూ.. నా గోల్.. నా లైఫ్.. నా కుటుంబం.. కథ కాకరకాయ అంటూ పిట్టకథలన్నీ చెప్పీ.. తీరా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తరువాత.. వాళ్లు నడిపే పత్తేపారం ఏంటయ్యా అంటే.. ఇద్దరమ్మాయిలతో కాదు.. ఇద్దరబ్బాయిలతో అంటూ ప్రేమాయణం మొదలుపెట్టేశారు.

బిగ్ బాస్ హౌస్‌ అంటేనే పత్తేపారాలకు అడ్డా. వయసులో ఉన్న యువతీ యువకుల్ని హౌస్‌లోకి పంపించి.. ఎంత ప్రేమించుకుంటారో ప్రేమించుకోండి.. మాకు కావాల్సింది కంటెంట్ ఎంత ఇస్తే అంత ఎక్కువ హైలైట్ చేస్తాం అని చెప్పకనే చెప్తుంటారు. వాళ్ల కోసం సోఫాలు, బెడ్‌లు రెడీ చేసి మరీ ప్రేమకలాపాలు సాగించడానికి కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పిస్తుంటారు.

ప్రతి సీజన్‌లోనూ రెండు మూడు ప్రేమ జంటల్ని కలుపుతుంటాడు బిగ్ బాస్. వాళ్లకి కావాల్సిన కంటెంట్‌ రావడం కోసం.. కంటెంట్‌కి తగ్గ కంటెస్టెంట్స్‌నే హౌస్‌లోకి పంపిస్తుంటారు. అయితే ఈ సీజన్‌లో బిగ్ బాస్‌కి కావాల్సిన కంటెంట్‌ని అందిస్తున్నారు ఈ ముగ్గురు ప్రేమికులు

ఇద్దరమ్మాయిలతో అనే సినిమా చూశారు కదా.. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అన్నమాట అదే ‘ఇద్దరబ్బాయిలతో’. రీతూ చౌదరి అంటేనే బోల్డూ.. పెళ్లై విడాకులు తీసుకుని ఈ సుందరి ఆరబోత, బోల్డ్ నెస్ గురించి అందరికీ తెలిసిందే. ఇలాంటి బోల్డ్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడుతుంది అంటే.. బొమ్మ A సర్టిఫికేట్ అవుతుందని అంతా ఆశించారు. ఊహించారు. అయితే వాళ్ల ఆశల్ని, ఊహల్ని ఏమాత్రం వృధా చేయడం లేదు రీతూ చౌదరి.

హౌస్‌లో మంచి కత్తిలాంటి ఇద్దరు కుర్రాళ్లతో ‘ఇద్దరబ్బాయిలతో’ అనే ప్రేమ పూర్వక పత్తేపార కార్యక్రమానికి తెరతీసింది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా ఎంపికై సామాన్యుల కోటాలో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన డీమాన్ పవన్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ.. ఇప్పుడు రీతూ ప్రేమకోసం తపించిపోతున్నారు. అగ్నిపరీక్షలో ఉన్నప్పుడు.. లైఫ్, గోల్, అఛీవ్‌మెంట్ అంటూ సోది కబుర్లు చెప్పి.. తీరా హౌస్‌లోకి వెళ్లిన తరువాత రీతూ చుట్టూ ప్రదక్షిణలు చేసే పనిలో పడ్డారు.

ఇప్పటికే బిగ్ బాస్ హౌస్‌లో వీళ్ల వేషాలను చూసి.. కపుల్స్ అని మాట్లాడుకుంటున్నారు. డైలాగ్‌లు వేసుకుంటున్నారు. ఇక వీళ్లైతే అస్సలు చేత్తోనే తినడం మానేశారు. ఒకరికొకరు తినిపించుకోవడం.. ఒకరి బుగ్గలు ఒకరు గిల్లుకోవడం.. హౌస్‌లో ఎక్కడ ఏకాంతంగా కనిపిస్తే అక్కడికి దూరిపోవడం.. అబ్బో గబ్బుకి లేదు హద్దిక్కడా అన్నట్టుగా చెలరేగిపోతున్నారు.

విచిత్రం ఏంటంటే.. పోనీ ఏదో వయసులో ఉన్నారు.. ఇలాంటివి మామూలే అనుకుని లైట్ తీసుకునే అవకాశం లేకుండా.. ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో జనానికి పిచ్చెక్కిస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో అయితే.. జవాన్ అంటూ బిల్డప్ కొట్టిన పవన్ కళ్యాణ్.. రీతూ చౌదరిని చూసి సొల్లుకార్చుకుంటూ.. నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేశాడు. అక్కడే డీమాన్ పవన్ కూడా ఉన్నాడు. మనోడూ తక్కువేం కాదు.. నేనెందుకు ట్రై చేయకూడదు అన్నట్టుగా తెగ పోటీ పడుతున్నాడు.

మరి వీళ్ల కథ ఎటు వైపుకి వెళ్తుందో.. ఎన్ని విధాలుగా మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇలాంటి కంటెంట్ ఇస్తున్నారంటే.. బిగ్ బాస్ అస్సలు నిరుత్సాహపరచడు. కావాల్సినంత ఎంకరేజ్ చేస్తాడు కాబట్టి.. ఈ ‘ఇద్దరబ్బాయిలతో’ కథని అయితే శృంగారభరిత చిత్రంగా మార్చే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *