Bigg Boss 7 Telugu Elimination: ఈవారం డబుల్ ఎలిమినేషన్.. బిగ్ బాస్ ముద్దుబిడ్డ ఔట్.. అతనికి రెడ్ కార్డ్

Bigg Boss 7 Telugu Double Elimination: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ నిజంగానే ఉల్టా పుల్టా అన్నట్లుగా ఉంది. ఈ నాలుగో వారం వీకెండ్ వచ్చేసరికి ఓటింగ్ పోల్స్ మారాయి. అంతేకాకుండా ఈ వారం డబులు ఎలిమినేషన్‌కు ఎక్కువ అవకాశం ఉందని సమాచారం.
Bigg Boss 7 Telugu 4th Week Elimination: బిగ్ బాస్ 7 తెలుగు షో గత ఆరో సీజన్‍తో పోలిస్తే చాలా బెటర్‌గా సాగుతోంది. తొలి రోజు నుంచే కంటెస్టెంట్ల గేమ్ కోసం కష్టపడుతున్నారు. అయితే ఈ ఏడో సీజన్‌లోకి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ వచ్చిన విషయం తెలిసిందే. వారిలో ఇప్పటికే ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, సెకండ్ వీక్ షకీలా, మూడో వారం సింగర్ దామిని భట్ల ఎలిమినేట్ అయి హౌజ్ విడిచి వెళ్లిపోయారు.
నామినేషన్లలో
ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‍లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో ఆట సందీప్, శివాజీ, శోభా శెట్టి పర్మనెంట్ ఇంటి సభ్యులు అయ్యారు. వీరితోపాటు తాజాగా నాలుగో పవరాస్త్ర పొంది పల్లవి ప్రశాంత్ నాలుగో ఇంటి సభ్యుడయ్యాడు. అతనికి రెండు వారాల ఇమ్యునిటీతోపాటు అతన్ని ఎవరూ నామినేట్ చేయకూడదనే అవకాశాన్ని పొందాడు. ప్రస్తుతం నాలుగో వారం నామినేషన్లలో ప్రియాంక జైన్, శుభ శ్రీ, గౌతమ్ కృష్ణ, రతిక రోజ్, ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ ఆరుగురు ఉన్నారు.
మారిన ఓటింగ్
మంగళవారం ఓటింగ్ పోల్ (Bigg Boss 7 Telugu Vote: మొదలవ్వగా.. శుక్రవారం నాడు పూర్తయింది. ఈ ఓటింగ్ పోల్‍లో 26.29 శాతంతో ప్రిన్స్ యావర్ మొదటి స్థానం, 16.86 శాతంతో రెండో స్థానంలో గౌతమ్ ఉన్నారు. నాలుగో ప్లేసులో కొనసాగిన శుభ శ్రీ ప్రియాంక జైన్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి వచ్చింది. శుభకు 16.51 శాతం, ప్రియంకకు 15.92 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఇక 13.64 శాతంతో టేస్టీ తేజ, 10.78 శాతంతో రతిక రోజ్ చివరి రెండు స్థానాల్లో ఉన్నారు.
డబుల్ ఎలిమినేషన్
మొన్నటివరకు తేజ ఆఖరులో ఉండేవాడు. వీకెండ్ వచ్చేసరికి తేజ, రతిక ఎలిమినేషన్‌కు పోటీ పడుతున్నారు. అయితే స్మైలీ టాస్క్ లో గౌతమ్‌ను తేజ ఫిజికల్ అటాక్ చేయడంతో అతనికి నెగెటివిటీ పెరిగింది. ఇందుకు గాను తేజకు రెడ్ కార్డ్ చూపించి హౌజ్ నుంచి పంపించేయనున్నారని టాక్. అదే కాకుండా ఈవారం 90 శాతం డబుల్ ఎలిమినేషన్ ఉండనుందట. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే.. తేజతోపాటు రతిక రోజ్‍ను కూడా ఎలిమినేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని బిగ్ బాస్ వర్గాల సమాచారం.
తేజనే ఎలిమినేట్
రతిక రోజ్ ఎలిమినేట్ అయితే ప్రేక్షకులు మాత్రం తెగ సంతోషంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అంతలా ఆమె బిహేవియర్ హౌజ్‌లో చిరాకు తెప్పించింది. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం కేవలం టేస్టీ తేజనే ఎలిమినేట్ కానున్నాడు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ముద్దు బిడ్డ రతిక రోజ్ ఎన్ని తప్పులు చేసినా.. పెద్దయ్య వారించడు, వీకెండ్స్ లో నాగార్జున కూడా మందలించడని తెలిసిందే. మరి ఈసారి రతికను ఎలిమినేట్ చేస్తారో.. లేదా కాపాడుకుంటారో చూడాలి.