Bigg Boss 7 Telugu : రతికను కేర్ చేయని ప్రశాంత్.. హౌస్‍లో అందరూ మహానటులే!

Oct 02, 2023 07:29 AM IST
Share on Twitter
Share on Facebook
Share on Whatsapp
మమ్మల్ని ఫాలో అవ్వండి
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ 7 నుంచి రతిక వెళ్లింది. అయితే ఆమె వెళ్లే సమయంలో హౌస్‍లో జరిగిన పరిస్థితి చూస్తే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రతిక వెళ్లడంతో పెద్దగా ఎవరూ బాధపడినట్టుగా కనిపించడం లేదు.
బిగ్ బాస్ 7 తెలుగు వీకెండ్ ఎపిసోడ్ ఆసక్తిగా సాగలేదు. కంటెస్టెంట్ల నుంచి ఆశించినంత ఎంటర్‌టైన్మెంట్ అయితే కనిపించలేదు. నన్ను హౌస్ మేట్ గా ఎందుకు తీసేశారో.. దానికి సరైన కారణాలు చెప్పమని శివాజీ అడిగిన ట్రాక్ కాస్త ఆసక్తిగా సాగింది. తర్వాత బొమ్మ గియ్ అంటూ ఓ టాస్క్ ఆడించారు నాగార్జున. మధ్య మధ్యలో నామినేషన్స్ లో ఉన్నవారిని సేవ్ చేశారు.
చాలా మందే ఊహించినట్టుగా ఈసారి రతిక రోజ్ ఎలిమినేట్ అయ్యింది. ఆమె బయటకు వెళ్లిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మెుదటి నుంచి ఆమె ఉన్న తీరు.. తర్వాత మారిన విధానం చూసి.. ప్రేక్షకులు కూడా తిరస్కరించారు. రతికను ఎలిమినేట్ చేయగానే.. హౌస్‍లో కాస్త సైలెంట్ అయ్యారు. కానీ ఎవరూ పెద్దగా ఎమోషనల్ అయినట్టుగా మాత్రం కనిపించ లేదు.
రతిక వెళ్లిపోతుంటే పల్లవి ప్రశాంత్ ఎక్కువగా బాధపడతాడని అంతా అనుకున్నారు. అసలు ఆ విషయాన్నే పెద్దగా పట్టించుకోనట్టుగా కనిపించాడు ప్రశాంత్. రతిక కూడా అందరితో మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ పల్లవి ప్రశాంత్, శివాజీ దగ్గరకు మాత్రం అస్సలు రాలేదు. అప్పటికే శివాజీ దగ్గర వెళ్లాడు. కానీ పట్టించుకోనట్టుగా చేసింది రతిక. ఇదే విషయంపై శివాజీ కూడా కామెంట్స్ చేశాడు. బిడ్డ బిడ్డ అంటూ దగ్గరకు వెళ్లినా.. పట్టించుకోలేదని చెప్పుకొచ్చాడు.
ఇక పల్లవి ప్రశాంత్ మాత్రం.. రతిక వెళ్లిపోతుంటే దూరం దూరంగానే ఉన్నాడు. ఆమె కూడా అతడిని పెద్దగా పట్టించుకోలేదు. ఇతర కంటెస్టెంట్స్ కూడా రతిక కోసం ఏడిచినట్టుగా మాత్రం కనిపించలేదు. కేవలం హౌస్ నుంచి ఒకరు వెళ్లిపోతున్నారని మాత్రమే అనుకున్నారు. అదే.. కిరణ్, షకీలా, దామిని వెళ్లిపోతుంటే.. మాత్రం హౌస్‍లో చాలా మంది ఎమోషనల్ అయ్యారు. రతిక విషయంలో మాత్రం సీన్ అలా లేదు. బాధపడినట్టుగా అందరూ నటించారని చర్చ ఉంది. అందరూ మహా నటులేనని జనాలు కూడా అనుకుంటున్నారు.
ఆమె కొన్నిసార్లు ఒక వైపు, మరోసారి ఇంకోవైపు ఉండటమే ఇందుకు కారణమైంది. ప్రశాంత్, యావర్ తో ఏదో ట్రాక్ నడిపించాలని అనుకుంది. మళ్లీ వాళ్లకు రివర్స్ అవ్వడమే ఆమెకు మైనస్ అయిందని చెప్పొచ్చు. మెుదటి వారంలో ప్రశాంత్‍తో ఆమె ట్రాక్ నడిపిస్తుంటే.. జనాలు ఎంజాయ్ చేశారు. కానీ తర్వాత అదే ప్రశాంత్‍కు సరైన కారణం లేకుండా వ్యతిరేకం అవ్వడంతో బాగా నెగెటివిటీ పెరిగిపోయింది. రతిక బయటకు వెళ్లేందుకు ఇలాంటి కారణాలు చాలానే ఉన్నాయి.