Bigg Boss 7 Telugu : మళ్లీ శోభాశెట్టి వర్సెస్ బోలే.. టీవీ పగలకొడతానని సీరియస్

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ 7 తెలుగు తాజా ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది. నామినేషన్స్ తో మళ్లీ గొడవలు మెుదలు అయ్యాయి. భోలేపై శోభాశెట్టి మరోసారి ఫైర్ అయింది.
బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్స్ గరంగరంగా జరిగాయి. భోలేపై శోభాశెట్టి(Shobha Shetty) మరోసారి మాటల యుద్ధానికి దిగింది. పల్లవి ప్రశాంత్.. గౌతమ్, అమర్ దీప్ లతో ఎక్కువసేపు వాదించాడు. దీంతో తాజా ఎపిసోడ్లో శివాజీ, శోభాశెట్టి, భోలే, అశ్వినీ శ్రీ, గౌతమ్, సందీప్, ప్రియాంక నామినేషన్స్ మాత్రమే చూపించారు.
ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు ఏ ఇద్దరు అర్హులో చెప్పాలని, వారి ఫొటోలను మంటల్లో వేయాలని బిగ్ బాస్(Bigg Boss) చెప్పాడు. రతికాను నామినేట్ చేసేందుకు వీలులేదని పేర్కొన్నాడు. శివాజీ మెుదట వచ్చి.. శోభాశెట్టి, ప్రియాంకలను నామినేట్ చేశాడు. భోలే విషయం గురించి ప్రస్తావిస్తూ.. తప్పు మాట్లాడాడని, కానీ ఆ విషయంపై సారీ చెప్పినా.. శోభా పట్టించుకోలేదని వివరించాడు. క్షమిస్తే.. ఏం అయిపోద్దని తన అభిప్రాయమని శివాజీ చెప్పగా.. దేవుడు మీకు క్షమించే మనసు ఇచ్చాడు అని, నాకు మాత్రం ఇవ్వలేదని కౌంటర్ ఇచ్చింది శోభాశెట్టి. నన్ను నామినేట్ చేసేందుకు పాయింట్ చెప్పమని అడిగింది. బోలేను థూ అన్నందుకు ప్రియాంకను నామినేట్ చేశాడు.
ఇక బోలే రాగానే.. శోభా శెట్టి, గౌతమ్‍ను నామినేట్ చేశాడు. నోరు జారినప్పుడు ఎన్ని జరిగాయో తెలుసా అని, మీ మెుండితనం మీ భవిష్యత్‍కు కూడా బాగోదని తెలిపాడు. నీకు బతిమాలాడి సారీ చెప్పినా.. పంతాలు వద్దని వివరించాడు బోలే. నీకోసం ప్రియాంక కూడా సారీ చెప్పిందనగా.. నేను ఆమె కోసం సారీ చెప్పలేదని నేను చేసిన పనికి సారీ చెప్పానని ప్రియాంక చెప్పుకొచ్చింది. ఇది మూడు నెలల ఆట మాత్రమే.. జీవితంలో చాలా ఎదురవుతాయని బోలే చెప్పగా.. మీరు నాకు జీవిత పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని శోభా శెట్టి మాట్లాడింది. బయటకు వెళ్లి టీవిలో చూశాక అని బోలే అంటుండగా.. టీవీ పగలగొడతానని గట్టిగా మాట్లాడింది శోభా. నీ మాట విని నేను మారిపోతే.. శోభా శెట్టిని ఎందుకు అవుతానని సీరియస్ అయింది.