Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‍లో బ్యూటిఫుల్ లాయర్- శుభ శ్రీ.. ఆమె గురించి తెలియని విషయాలు!

 Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‍లో బ్యూటిఫుల్ లాయర్- శుభ శ్రీ.. ఆమె గురించి తెలియని విషయాలు!

Bigg Boss 7 Telugu Subhashree Rayaguru: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లోకి దాదాపు అందరూ బ్యూటిఫుల్ ముద్దుగుమ్మలే ఎంట్రీ ఇచ్చారు. వారిలో లాయర్ అండ్ నటి శుభశ్రీ ఒకరు. మరి ఆమె గురించి తెలుసుకుందామా!

బిగ్ బాస్‍లో బ్యూటిఫుల్ లాయర్ శుభ శ్రీ

చదువుకునే రోజుల్లోనే పలు సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేది శుభ శ్రీ రాయగురు. ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్‍తోపాటు అన్ని ఆటలు ఆడి ముందుండేది. కాలేజీ పూర్తయిన తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

2020 సంవత్సరంలో విఎల్ సీసీ ఫెమినా మిస్ ఇండియా ఒడిషా టైటిల్ గెలుచుకుంది ముద్దుగుమ్మ శుభ శ్రీ. తర్వాత యాంకర్‍గా కెరీర్ మొదలు పెట్టి సుమారు 3000 లైవ్ షోలు చేసింది. ఈ క్రమంలోనే నటిగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

గతేడాది విడుదలైన రుద్రవీణ సినిమాతో శుభ శ్రీ టాలీవుడ్ చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం కల్యాణ్ రామ్ అమిగోస్ మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసింది ఈ ముద్దుగుమ్మ. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ మూవీలో కూడా నటించినట్లు ఈ బ్యూటి చెప్పుకొచ్చింది.

తమిళ, కన్నడ భాషల్లోనూ అనేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన శుభ శ్రీ.. ఓ వైపు లాయర్‍గా మరోవైపు నటిగా, మోడల్‍గా, యాంకర్‍గా చేసి మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంది. ఇటీవల బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లోకి 5వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది.

బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లో శుభ శ్రీని అందరూ సుబ్బు అని పిలుస్తారు. అందరితో పాజిటివ్‍గా తనదైన ఆటతో మెప్పించే ప్రయత్నం చేస్తుంది. గౌతమ్ కృష్ణతో మొదట్లో చనువుగా ఉండేది. బ్యూటిఫుల్ లుక్స్ తో పాటు గేమ్ పరంగా ఆకట్టుకుంటోంది బ్యూటిఫుల్ లాయర్ శుభ శ్రీ.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *