Bigg Boss 7 Telugu: “పోవే అవతలికి.. ఎప్పుడూ అరుస్తుంటావ్”: శోభపై టేస్టీ తేజ ఫైర్: వీడియో

 Bigg Boss 7 Telugu: “పోవే అవతలికి.. ఎప్పుడూ అరుస్తుంటావ్”: శోభపై టేస్టీ తేజ ఫైర్: వీడియో

Bigg Boss 7 Telugu Day 52 Promo: శోభా శెట్టిపై టేస్టీ తేజ విపరీతంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీదానికి రాద్దాంతం చేస్తావెందుకంటూ అరిచారు.

Bigg Boss 7 Telugu Day 52 Promo: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍లో తదుపరి వారం కెప్టెన్సీ కంటెడెర్షిప్ కోసం పోటీ మొదలైంది. కెప్టెన్సీ కోసం ఎవరు పోటీపడాలో ఈ టాస్కుల ద్వారా బిగ్‍బాస్ నిర్ణయించనున్నారు. ఇందుకోసం నేటి (ఆగస్టు 25) ఎపిసోడ్‍లో కంటెస్టెంట్‍లతో రెండు మైండ్‍గేమ్స్ ఆడించనున్నారు బిగ్‍బాస్. ఇందుకు సంబంధించిన ప్రోమోలు కూడా వచ్చాయి. అయితే, ఈ క్రమంలో టేస్టీ తేజ, శోభా శెట్టి మధ్య గొడవ జరిగింది. శోభపై గట్టిగా అరిచారు తేజ. వివరాలివే..

ముందుగా నీటిలో ఏ వస్తువులు మునుగుతాయో.. ఏవి మునగవో కంటెస్టెంట్లు చెప్పాలనే ఫ్లోట్ ఆర్ సింక్ గేమ్‍ను బిగ్‍బాస్ పెట్టారు. వస్తువు మునుగుతోందో.. లేదో కరెక్ట్‌గా చెప్పిన కంటెస్టెంట్‍కు పాయింట్ వస్తుంది. నలుగురి చొప్పున ఈ గేమ్ జరిగింది. ఈ మైండ్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్‍గా సాగినట్టు కనిపిస్తోంది. అయితే, ఆ తర్వాత జరిగిన గేమ్‍ సందర్భంగా శోభా శెట్టిపై టేస్టీ తేజ ఫైర్ అయ్యారు.

బాక్సుల కలర్లను మ్యాచ్ చేసేలా క్యూబ్ పజిల్ అంటూ కంటెస్టెంట్లకు రెండో గేమ్ నిర్వహించారు బిగ్‍బాస్. కంటెస్టెంట్లు వేగంగా బాక్సుల కలర్లను మార్చేందుకు ప్రయత్నించారు. ఓ గేమ్‍లో యావర్ ముందుగా ఈ టాస్క్ పూర్తి చేశారు. తాను ఓడిపోయానని తేజ అన్నారని శోభ అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ‘నేను విన్నాను తేజ’ అన్నారు శోభ. దీంతో టేస్టీ తేజ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. “ఏయ్.. పోవమ్మా.. పొద్దాకల (ఎప్పుడూ) అరుస్తుంటావు. పో లోపలికి..” అంటూ తేజ గట్టిగా అరిచారు. “ప్రతీసారి అరుస్తావెందుకు.. అవసరం లేదు పో” అక్కడి నుంచి తేజ వెళ్లిపోయారు.

భయంతో వెళుతున్నావంతే.. మనిషి ఏడ్చాడంటే ఓ వాల్యూ ఉంటుందని శోభ ఏదో చెప్పబోయారు. అయితే.. ఏమీ లేని దాన్ని పెద్దది చేయవద్దంటూ తేజ వారించారు. ఎక్కడికి వెళుతున్నావంటే.. “ఒసేయ్ ఇక్కడే ఉన్నా కదా” అంటూ కోపంతో ఊగిపోయారు తేజ. శోభ ఏంటి ఇలా చేస్తోందని శివాజీతో తేజ చెప్పుకున్నారు. సరదాగా అంటే ఎందుకిదంత అని అన్నారు. ఏది ఎక్కువైనా ఇలాగే ఉంటుందని, వదిలేసేయాలని శివాజీ చెప్పారు. ఎప్పుడూ క్లోజ్‍గా ఉంటే శోభ, తేజ అరుచుకోవటంతో హౌస్ మొత్తం హీటెక్కిపోయింది. ఈ గేమ్‍ల్లో ఎవరు గెలిచారు.. గొడవ ఎలా జరిగిందన్న విషయాలు మొత్తం నేటి ఎపిసోడ్‍లో ఉండనుంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *