Bigg Boss 7 Telugu: “నేను ఆ మాట అనలేదు”: శోభతో యావర్ వాదన.. సందీప్‍తోనూ గొడవ.. అమర్‌తో భోలే..

Bigg Boss 7 Telugu Promo: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా నామినేషన్ల సమయంలో ఒక్కొక్కరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. 8వ వారం నామినేషన్స్ సోమవారం ఎపిసోడ్‍లో కొన్ని రాగా.. నేటి (అక్టోబర్ 24) ఎపిసోడ్‍లోనూ ప్రక్రియ కొనసాగనుంది. నామినేషన్ల సందర్భంగా నేడు యావర్‌తో శోభా శెట్టి, సందీప్ గొడవ పడ్డారు. అమర్‌దీప్, భోలే షావలి మధ్య కూటా మాటలు హీట్‍గా సాగాయి. ఇందుకు సంబంధించిన ప్రోమో వచ్చింది.
ఈ ప్రోమోలో ముందుగా.. శోభా శెట్టిని ప్రిన్స్ యావన్ నామినేట్ చేశారు. “నేను నిన్ను హిట్లర్ అన్నానా?” అని శోభను యావర్ ప్రశ్నించారు. దీంతో అన్నావని శోభ చెప్పారు. అయితే, హిట్లర్ అనే మాట అనలేదని యావర్ వారించారు. అలా అడ్డంగా మాట్లాడొద్దని ఫైర్ అయ్యారు.
ఆ తర్వాత అమర్, భోలే షావలి మధ్య గొడవ జరిగింది. గేమ్ ఎక్కడ ఆడారని షావలిని అమర్ ప్రశ్నించారు. అయితేే, ఆగ్రహించిన భోలే.. “ఒకటో వారం.. రెండో వారం.. మూడో వారం.. నాలుగో వారం.. నువ్వేం ఆడినవయ్యా” అని గట్టిగా అరిచారు. ఐదు వారాలు తాను ఆడింది గేమే అంటూ అమర్ చెప్పారు. అయితే, ఆ తర్వాత అమర్‌ను ఇమిటేట్ చేశారు భోలే. “నీ దగ్గర ఒక్క పాటిటివ్ ఆలోచన ఉండదు. అంతా నెగెటివే” అని భోలే అన్నారు. దీంతో షావలి ఫొటోను మంటలో వేసి ఆయనను నామినేట్ చేశారు అమర్.
“నువ్వు సేఫ్ ప్లేయర్. స్వార్థపరుడివి” అని సందీప్‍ను యావర్ అన్నారు. దీంతో “నీ కన్నా సేఫ్ ప్లేయర్ హౌస్‍లో ఎవరూ ఉండరు యావర్” అని కౌంటర్ వేశారు అమర్. అందుకే స్టార్టింగ్ నుంచి తాను నామినేషన్లలో ఉన్నానని వ్యంగ్యంగా సెటైర్ వేశాడు యావర్. సందీప్ ఏదో అభ్యంతకరపదం వాడారని భోలే వాదించారు. దీంతో సందీప్ గట్టిగా అరిచారు.
“గట్టిగా అరిస్తే మనం మాట్లాడింది.. తప్పు ఒప్పవదు.. ఒప్పు తప్పవదు” అంటూ సందీప్‍కు శివాజీ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, సందీప్ మాత్రం అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత శివాజీని అమర్ నామినేట్ చేశారు. అమర్ కారణం చెప్పబోతోంటే.. “నువ్వు వేయాలనుకొనే వచ్చావ్.. వేసేయ్” అని శివాజీ అన్నారు. ఈ 8వ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారో నేటి ఎపిసోడ్‍లో తెలియనుంది.