Bigg Boss 7 Telugu: చరిత్రలో లేని విధంగా నామినేషన్స్.. అదే పెద్ద ట్విస్ట్.. ఎంతమంది నామినేట్ అయ్యారంటే?

Bigg Boss 7 Telugu Nominations: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ నాలుగో వారం నామినేషన్స్ బిగ్ బాస్ చరిత్రలో జరగని విధంగా జరిగాయి. 5 రౌండ్లతో జ్యూరి సభ్యుల నిర్ణయంతో ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు.
Bigg Boss 7 Telugu 4th Week Nominations: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ సోమవారం (సెప్టెంబర్ 25)న ప్రారంభమైన నాలుగో వారం నామినేషన్ల ప్రక్రియ మంగళవారం వరకు జరిగింది. బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా నామినేషన్స్ నిర్వహించారు. హౌజ్ మేట్స్ అయినా సందీప్, శివాజీ, శోభా శెట్టి జ్యూరి సభ్యులుగా (జడ్జెస్) ఉండగా.. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు కంటెస్టెంట్లను కోర్ట్ బోన్‍లో నిల్చుండబెట్టి కారణాలు చెప్పి నామినేట్ చేయాలి. నామినేట్ అయ్యేవారు డిఫెండ్ చేసుకోవాలి.
వారి వాదనలో ఎవరూ కరెక్ట్, కాదు అనేది ఆలోచించి ఇద్దరిలో ఒక్కరిని నామినేట్ చేస్తారు జ్యూరి సభ్యులు. అలా ఈసారి నామినేషన్ల ప్రక్రియ మరింత హీట్ పెంచింది. సైలెంట్‍గా ఉండే గౌతమ్ సైతం బూతులు మాట్లాడాడు. జ్యూరి సభ్యుడు శివాజీపై తెగ ఫైర్ అయ్యాడు. మొత్తానికి నామినేషన్లలో ముందుగు ఐదుగురిని ఉంచారు జ్యూరి సభ్యులు. 5 రౌండ్లలో జరిగిన బిగ్ బాస్ 7 తెలుగు 4వ వారం నామినేషన్లలో ప్రియాంకను యావర్, రతికను శుభ శ్రీ, గౌతమ్‍ను ప్రశాంత్, శుభ శ్రీని అమర్, యావర్‍ను గౌతమ్ నామినేట్ చేశారు.
బిగ్ బాస్ 7 తెలుగు నాలుగో వారం నామినేషన్లలో ముందుగా ప్రియాంక జైన్, రతిక రోజ్, గౌతమ్ కృష్ణ, శుభ శ్రీ, ప్రిన్స్ యావర్ జాబితాలో ఉన్నారు. తర్వాత జ్యూరి మెంబర్స్ ఏకాభిప్రాయంతో సేఫ్‍లో ఉన్న ఒకరిని నామినేషన్‍లో చేర్చాలని బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ప్రశాంత్, అమర్ దీప్, టేస్టీ తేజ ముగ్గురు సేఫ్‍లో ఉన్నారు. వీరిలో తేజను నామినేట్ చేద్దామని సందీప్, శివాజీ అన్నారు. కానీ, తన బెస్ట్ ఫ్రెండ్ కారణంగా అతన్ని కాపాడటానికి శోభా ట్రై చేసింది.
గతవారం నామినేషన్లలో తమ పవర్ ఉపయోగించి అమర్ దీప్ చౌదరిని ఆట సందీప్, శివాజీ నామినేట్ చేశారు. అలాగే తేజను కూడా నామినేషన్ల నుంచి తీసి సేఫ్ చేశారు. ఈసారి తేజ కంటే ప్రశాంత్ బాగా ఆడాడు కాబట్టి, ఇంకా టాస్కులో మెరుగ్గా పాల్గొనలాని భావించిన జ్యూరి టీమ్ ఫైనల్‍గా తేజను నామినేట్ చేసింది. ఇలా బిగ్ బాస్ 7 తెలుగు నాలుగో వారం నామినేషన్లలో టేస్టీ తేజతో కలిపి ఆరుగురు ఉన్నారు.