BIG BREAKING: బయటకు వచ్చిన కేసీఆర్.. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు

 BIG BREAKING: బయటకు వచ్చిన కేసీఆర్.. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు

11 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని కేసీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కార్ పై అన్ని వర్గాల్లో అసంపూర్తి ఉందన్నారు. మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో వందకు వంద శాతం ప్రభుత్వం మనదేనని ధీమా వ్యక్తం చేశారు.

11 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని కేసీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కార్ పై అన్ని వర్గాల్లో అసంపూర్తి ఉందన్నారు. మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో వందకు వంద శాతం ప్రభుత్వం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆధ్వర్యంలో కేసీఆర్ ను ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌజ్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలు కలిశారు. సినిమా ప్రొడ్యూసర్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి , సినీ ఆర్టిస్ట్  రవితేజ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ప్రజాస్వామ్యంలో గెలవాల్సింది ప్రజలు..

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. జరుగుతున్నది అందరికీ తెలుసన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలని తాను గతంలో అనేక ఎన్నికల సభల్లో చెప్పానని గుర్తు చేశారు. అంతే ప్రజలు పొరపాటున ఏదో ఓ మాయలో పడి గాలికి ఓటెస్తే.. వారికే నష్టం, కష్టం జరుగుతుందన్నారు. ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. శూన్యంలో నుంచి సునామీ సృష్టించిన చరిత్ర తమదన్నారు.

ప్రజలు ఏం కోల్పోయారో వారికి అర్థం అయ్యిందన్నారు. తాము 10 శాతమే హామీలు ఇచ్చామన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల కన్నా కూడా 90 శాతం ఎక్కువగా అమలు చేసిన చరిత్ర తమదన్నారు.  ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది సేవ చేయడానికి అని కాంగ్రెస్ సర్కార్ ను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. అంతే కానీ కూలగొడతామంటూ పిచ్చిగా మాట్లాడొద్దని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలి కానీ.. భయపెట్టొద్దన్నారు.

ఎట్టకేలకు బయటకు వచ్చిన కేసీఆర్..

కాళేశ్వరం, పవర్ కమిషన్ల విచారణ, హైడ్రా నేపథ్యంలో ఆందోళనలు, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ పేరు రావడం తదితర అంశాలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నా కేసీఆర్ నోరు విప్పకపోవడం చర్చ నీయాంశమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకు కేసీఆర్ బయటకు రాలేదు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా.. అనంతరం మళ్లీ సైలెంట్ అయిపోయారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అసెంబ్లీకి వచ్చినా.. ఆ తర్వాత మళ్లీ సభకు రాలేదు. దీంతో అప్పటి నుంచి కేసీఆర్ మళ్లీ ఎప్పుడు బయటకు వస్తారు? అన్న చర్చ తెలంగాణ పాలిటిక్స్ లో జోరుగా సాగుతోంది. అయితే ఎట్టకేలకు ఈ రోజు కేసీఆర్ బయటకు రావడంతో ఆయన ఇక మళ్లీ యాక్టీవ్ అవుతారా? అన్న చర్చ మొదలైంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *