BIG BREAKING: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం!

 BIG BREAKING: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం!

ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో  సీబీఐ ఛార్జ్‌షీట్‌ నుంచి తమ సంస్థ పేరును తొలగించాలంటూ వాన్‌పిక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో  సీబీఐ ఛార్జ్‌షీట్‌ నుంచి తమ సంస్థ పేరును తొలగించాలంటూ వాన్‌పిక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గతంలో సీబీఐ వాన్‌పిక్‌ పేరును తన ఛార్జ్‌షీట్‌లో చేర్చింది.  ప్రస్తుతం నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది.అయితే  2022 జులైలో వాన్‌పిక్‌ ప్రాజెక్ట్‌ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. హైకోర్టు  ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్‌ చేసింది. తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా వాన్‌పిక్‌ ప్రాజెక్ట్‌ పిటిషన్‌ను అనుమతించారని వాదించింది. సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం మరోసారి పిటిషన్‌ను విచారించాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.  ఈ క్రమంలో మరోసారి వాన్‌పిక్‌ ప్రాజెక్టుపై వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం పిటిషన్‌ను రిజెక్ట్ చేసింది.

చైర్మన్‌గా నిమ్మగడ్డ ప్రసాద్

వాన్‌పిక్ ప్రాజెక్టు కేసు ఉమ్మడి ఏపీ సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైంది. ఇందులో అప్పటి ఏపీ ప్రభుత్వం, గల్ఫ్ దేశాలకు చెందిన రాస్ అల్ ఖైమా ప్రభుత్వంతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టాయి. నిమ్మగడ్డ ప్రసాద్ ఈ ప్రాజెక్టుకు చైర్మన్‌గా ఉన్నారు. ఈ ప్రాజెక్టు కోసం నిబంధనలను ఉల్లంఘించి సుమారు 15,000 ఎకరాలకు పైగా భూములు కేటాయించారని, దానికి ప్రతిఫలంగా నిమ్మగడ్డ ప్రసాద్‌ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కంపెనీలలో భారీ పెట్టుబడులు పెట్టారని సీబీఐ ఆరోపించింది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *