BIG BREAKING: కేటీఆర్ కు ఈడీ నోటీసులు
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 7న విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది ఈడీ.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో KTR కు ఈడీ ఎంటర్ అయ్యింది. ఈ నెల 7న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డికి సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 2, 3 తేదీల్లో విచారణ కు రావాలని వీరికి ఇచ్చిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఇదే కేసుకు సంబంధించి ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. ఈడీ ఫెమా, మనీలాండరింగ్ కింద కేటీఆర్ కేసులు నమోదు చేసింది. FEOకు రూ.55 కోట్ల బదిలీ, ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే.. విచారణ తర్వాత కేటీఆర్ ను ఈడీ అరెస్ట్ చేస్తుందా? అన్న అంశంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది