BIG BREAKING: ఏపీలో క్వశ్చన్ పేపర్ లీక్

BIG BREAKING: ఏపీలో క్వశ్చన్ పేపర్ లీక్
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ ప్రశ్నాపత్రం లీకైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా అరగంట ముందే పేపర్ లీక్ కావడం సంచలనం రేపుతోంది. కాలేజీ యాజమాన్యమే లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
BREAKING: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ ప్రశ్నాపత్రం లీకైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా అరగంట ముందే పేపర్ లీక్ కావడం సంచలనం రేపుతోంది. కాలేజీ యాజమాన్యమే లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
కాలేజీ యాజమాన్యంపై లోకేష్ ఫైర్..
అయితే ఈ ఘటనపై వెంటనే స్పందించని మంత్రి లోకేష్.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బి.ఎడ్ పరీక్షా పత్రం లీకేజి అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోందన్నారు. మధ్యాహ్నం 2.గంటలకు జరగాల్సిన ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్‍మెంట్ పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం నిర్ణీత సమయానికి ముందే లీక్ కావడంపై విచారణ నిర్వహించాల్సిందిగా ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు
ఇదిలా ఉంటే.. రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారిపై భారం ఉంటే సరిగా పాఠాలు చెప్పలేరని పేర్కొన్నారు. వచ్చే క్యాబినెట్ కు టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ తెస్తామని స్పష్టం చేశారు. టీచర్ల బదిలీల వ్యవహారం ఎంత గందరగోళంగా ఉంటుందో అందరికీ తెలుసునని, అలాంటి లిస్టును బహిరంగంగా పెట్టబోతున్నామని తెలిపారు. తద్వారా టీచర్లు తమ సీనియారిటీని స్వయంగా చూసుకోవచ్చని తెలిపారు. దీన్ని అత్యంత పారదర్శకంగా పబ్లీష్ చేస్తామని నారా లోకేశ్ ప్రకటించారు.