Avoid pairing with papaya: బొప్పాయిని ఏ ఆహారాలతో కలిపి తినకూడదో తెలుసా?

 Avoid pairing with papaya: బొప్పాయిని ఏ ఆహారాలతో కలిపి తినకూడదో తెలుసా?

Avoid pairing with papaya: జ్యూసీగా ఉండే బొప్పాయి అంటే అందరూ ఇష్టపడతారు. కానీ ఈ పండుని కొన్ని రకాల ఆహారాలు, పానీయాలతో కలిపి తీసుకోకూడదు.

ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందించే పండ్లలో బొప్పాయి ఒకటి. శరీరానికి కావలసిన పోషకాల్ని అందిస్తుంది. బొప్పాయి తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. సలాడ్, స్మూతీలో వేసుకుని తింటారు.

బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటండీ. జీర్ణక్రియని పెంచడంలో సహాయపడుతుంది. పేగు కదలికలు సులభతరం చేస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే బొప్పాయిని కొన్ని రకాల ఆహార పదార్థాలతో జత చేసి తీసుకోవడం వల్ల అలర్జీ వచ్చే సమస్య ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కూడా కావచ్చు. ఈ ఆహారాలతో బొప్పాయిని కలిపి ఎప్పుడూ తీసుకోవద్దు.

డైరీ ఉత్పత్తులు

పాలు, పెరుగు వంటి డైరీ ఉత్పత్తులతో కలిపి కొంతమంది బొప్పాయిని తీసుకుంటారు. మీరు అలా చేస్తుంటే వెంటనే ఆపేయడం మంచిది. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది పాల ఉత్పత్తుల జీర్ణక్రియ ప్రక్రియకి ఆటంకం కలిగిస్తుంది. పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తీసుకొస్తుంది.

స్పైసీ ఫుడ్స్

స్పైసీ ఫుడ్ శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. బొప్పాయి చల్లదనాన్ని అందించే పండు. ఆయుర్వేదం ప్రకారం ఈ రెండింటిని కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. లంచ్ లేదా డిన్నర్ తో పాటు బొప్పాయి తినడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో అసమతుల్యత ఏర్పడుతుంది. కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే భోజనంలో కూరలు కాస్త స్పైసీగా ఉంటాయి. అవి తిన్న వెంటనే బొప్పాయి తీసుకోకూడదు.

సిట్రస్ ఫ్రూట్స్

చాలా మంది అన్నీ రకాల పండ్లు కట్ చేసుకుని ఫ్రూట్ సలాడ్ చేసుకుని తింటారు. కానీ వాటిలో బొప్పాయి కలుపుకోకపోవడం మంచిది. సిట్రస్ పండ్లతో కలిపి బొప్పాయి తీసుకుంటే యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంట అనుభవిస్తారు.

ఛాయ్

ఛాయ్, బొప్పాయి రెండింటిని కలపకూడదు. ఇవి రెండూ వేర్వేరు స్వభావాలు కలిగి ఉంటాయి. వేడి, చల్లని ఆహారాల కలయికగా మారుతుంది. టీలో క్యాటెచిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలు కలిగిస్తుంది. బొప్పాయిలో ఉండే పపైన్ ఎంజైమ్ తో కలవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య మరింత దిగజారుతుంది. అందుకే ఈ పండుతో కలిపి తీసుకోవద్దు.

ద్రాక్ష

ద్రాక్ష, బొప్పాయి కూడా కలిపి తీసుకోకూడదు. ఆకుపచ్చ, నలుపులో ఉండే ద్రాక్షతో బొప్పాయి తినకూడదు. ద్రాక్షలో అధిక యాసిడ్ కంటెంట్ ఉంటుంది. కడుపుని ఇబ్బంది పెడుతుంది. ఈ రెండింటిని విడివిడిగా తీసుకోవడం మంచిది.

అధిక ప్రోటీన్ ఆహారాలు

బొప్పాయిలో పపైన్ ఉంటుంది. ఇది కొన్ని ప్రోటీన్ల జీర్ణక్రియకి ఆటంకం కలిగిస్తుంది. మాంసం వంటి అధిక ప్రోటీన్ ఆహారాలతో బొప్పాయి జత చేసి తింటే అజీర్తి సమస్య తలెత్తుతుంది.

కొవ్వు ఆహారాలు

బొప్పాయి తక్కువ కొవ్వు కలిగిన పండు. దీన్ని అధిక కొవ్వు పదార్థాలతో కలిపి తీసుకుంటే అజీర్ణం ఏర్పడుతుంది.

మందులు

కొన్ని రకాల మందులతో బొప్పాయి తీసుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. రక్తాన్ని పలుచన చేసే మందులు లేదా యాంటీ ప్లేట్ లెట్ మందులు వాడుతున్న వాళ్ళు బొప్పాయి తీసుకోవాలని అనుకుంటే వైద్యులని సంప్రదించి తినడం మంచిది. ఎందుకంటే ఈ మందుల పనితీరుకి అంతరాయం కలిగించే విటమిన్ కె బొప్పాయిలో ఉంటుంది.

గర్భధారణ సమయంలో పండని బొప్పాయి తినకూడదు. ఇందులో రబ్బరు పాలు ఎక్కువగా ఉంటాయి. పచ్చి బొప్పాయి తినడం వల్ల కడుపులో బిడ్డకు హాని చేస్తుంది. గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *