Atchannaidu: ఈ నెలలో రైతుల ఖాతాల్లోకి రూ.7వేలు.. మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్

ఏపీ ప్రజలకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. అన్నదాత సుఖీభవ సాయాన్ని రైతుల ఖాతాల్లో మూడు విడతల్లో అందజేస్తామని అన్నారు. పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.2 వేలు, రాష్ట్రం రూ.5 వేలు మొత్తం 7 వేల రూపాయలను ఈ నెల 21న తొలివిడతలో జమ చేస్తామన్నారు
ఏపీ ప్రజలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ తెలిపారు. అన్నదాత సుఖీభవ సాయాన్ని రైతుల ఖాతాల్లో మూడు విడతల్లో అందజేస్తామని అన్నారు. అందులో కేంద్ర, రాష్ట్రం వాటా ఉందని తెలిపారు. పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.2 వేలు, రాష్ట్రం రూ.5 వేలు ఇస్తుందని అన్నారు. మొత్తం 7 వేల రూపాయలను ఈ నెల 21న తొలివిడతలో జమ చేస్తామన్నారు.
ఈ మేరకు ఆయన ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరులో ఈ శుభవార్త తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏరువాక పౌర్ణమిని ప్రారంభించిన అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రైతులకు ఒక్క వ్యవసాయ పరికరం ఇవ్వలేదని మండిపడ్డారు.
కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు అధునాతన పరికరాలు ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం యంత్రపరికరాలు అందిస్తున్నామని తెలిపారు. గుంటూరు నుంచి ఇటీవల ఎగుమతి అయిన మిర్చిలో పురుగుమందుల అవశేషాలు అధికంగా ఉన్నాయని చైనా అధికారులు కొన్ని కంటెయినర్లను వెనక్కి పంపారని అన్నారు. అందువల్ల వాటిని దృష్టిలో పెట్టుకుని మంచి క్వాలిటీ పంటను ఉత్పత్తి చేయాలని వెల్లడించారు.
మరోవైపు ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో ముఖ్యమైన హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. సూపర్ సిక్స్‌లో భాగంగా ఇవాళ ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తుంది. దీని ద్వారా ఒక్కో విద్యార్థికి తమ తల్లులు ఖాతాలో రూ.15వేలు పడనున్నాయి. కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా మొత్తం 67 లక్షల మందికి డబ్బులు అందనున్నాయి.
అర్హులెవరు?
1వ తరగతి విద్యార్థి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థి వరకు కూడా ఈ పథకానికి అర్హులు. దీనికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇవాళ జీవో విడుదల చేయనుంది. ఈ స్కీమ్ కింద 12వ తరగతి వరకు చదువుతున్న స్టూడెంట్స్ తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం కింద ఈ డబ్బులు జమ చేస్తారు. ప్రతి ఏడాది రూ.15,000 ఇస్తారు.