Assembly: అసెంబ్లీ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న MLAలు

(VIDEO)
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై చర్చ పెట్టాలని అధికార NC ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లిన నినాదాలు చేపట్టారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ వాయిదా పడింది. అసెంబ్లీ ముందు MLAలు ఘర్షణకు దిగారు.
వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చ జరగాలని ఎమ్మెల్యేలు శాసన సభ ఆవరణలో ఘర్షణకు దిగారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై అసెంబ్లీలో తన అసంతృప్తిని వినిపించాలని కొందరు ఎమ్మెల్యేలు పోరాడుతున్నారు. అయితే మూడు రోజులగా అసెంబ్లీ వాయిదాల పర్వం నడుస్తోంది. అయితే ఈరోజు( బుధవారం) కొందరు ఎమ్మెల్యేలు శాసనసభ ప్రాంగణంలో గొడవ పడ్డారు. దీంతో సభను మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాయిదా వేశారు. అసెంబ్లీ లోపల ఆప్ ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్, పీడీపీ ఎమ్మెల్యే వహీద్ పారా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రెండు వర్గాలుగా మారిన ఎమ్మెల్యేలు.. ఒకరిపై ఒకరు దూషించుకున్నారు.
గత రెండు రోజుల నుంచి కూడా అసెంబ్లీని స్పీకర్ అబ్దుల్ రహీమ్ వాయిదా వేశారు. ఇవాళ కూడా అధికార నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లిన నినాదాలు చేపట్టారు. ఇటీవల కేంద్రం ఆమోదించిన వక్ఫ్ బిల్లుపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీకి చెందిన ప్రతిపక్ష నేత సునిల్ శర్మ కూడా వెల్‌లోకి దూసుకెళ్లిన ఎన్‌సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు ఎమ్మెల్యేలు సభలో ధర్నా చేపట్టారు. దీంతో ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ సమయంలో హౌజ్‌ను స్పీకర్ వాయిదా వేశారు.