TSPSC Exams : టీఎస్పీఎస్సీ పరీక్షలు రీషెడ్యూల్, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ!

 TSPSC Exams : టీఎస్పీఎస్సీ పరీక్షలు రీషెడ్యూల్, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ!

TSPSC Exams : టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. టీఎస్పీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఆదేశించారు.

TSPSC Exams : నిరుద్యోగులకు తెలంగాణ​ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీఎస్పీఎస్సీపై సోమవారం సీఎం రేవంత్​రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ ​ ప్రక్షాళన, పరీక్షల నిర్వహణపై చర్చించారు. టీఎస్పీఎస్సీ పరీక్షలను రీషెడ్యూల్​చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కాంగ్రెస్​ప్రభుత్వం ఇచ్చిన జాబ్​క్యాలెండర్​ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఆదేశించారు. గతంలో విడుదలైన నోటిఫికేషన్లపై మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను రీషెడ్యూల్​చేయాలని సీఎం రేవంత్​రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. గ్రూప్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది.

పరీక్షల రీషెడ్యూల్

కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీ చేసేందుకు అడుగులు వేస్తుంది. ఇప్పటికే ప్రొఫెసర్ కోదండరామ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. టీఎస్పీఎస్సీ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్త నోటిఫికేషన్లు ఉండనున్నాయి. పోటీ పరీక్షలకు త్వరలో కొత్త పరీక్ష తేదీలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

టీఎస్పీఎస్సీ ఛైర్మన్ రాజీనామా

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో.. గత ప్రభుత్వం పనిచేసిన అధికారుల రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డిని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి కలిసి బోర్డుకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఇంతలోనే జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. 2021 మేలో బీఆర్ఎస్ ప్రభుత్వం జనార్దన్ రెడ్డిని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా నియమించింది. ఇటీవల టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీతో పెద్ద దుమారం రేగింది. పేపర్ల లీకేజీతో పలు పరీక్షలను బోర్డు రద్దు చేసిన విషయం తెలిసిందే.

అయితే జనార్ధన్ రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసైకి సమర్పించారు. గవర్నర్ తక్షణమే జనార్దన్ రెడ్డి రాజీనామాకు ఆమోదం తెలిపారు. టీఎస్పీఎస్సీ తదుపరి ఛైర్మన్, సభ్యుల నియామకంపై చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారికి గవర్నర్ తమిళిసై లేఖ రాశారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *