APSRTC: ఏపీలో ఫ్రీ బస్ పథకం.. 2,000 బస్సులు, 11,500 మంది సిబ్బంది అవసరం

 APSRTC: ఏపీలో ఫ్రీ బస్ పథకం.. 2,000 బస్సులు, 11,500 మంది సిబ్బంది అవసరం

ఏపీ ఆర్టీసీ అధికారులు మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపై ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ పథకం అమలు చేస్తే రోజుకు సగటున 10 లక్షల మంది వరకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేశారు. అదనంగా 2వేల బస్సులు, 11,500 మంది సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చుతూ వస్తోంది. ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని త్వరలో అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై ఆర్టీసీ అధికారులు ప్రాథమిక నివేదికను తాజాగా ప్రభుత్వానికి అందించారు. ఈ నివేదిక ప్రకారం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తే.. ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని పేర్కొన్నారు.

11,500 మంది సిబ్బంది అవసరం

రోజుకు సగటున దాదాపు 10 లక్షల మంది వరకు ప్రయాణికులు సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. అంతేకాకుండా ఇప్పుడున్న బస్సులకి అదనంగా మరో 2,000 బస్సులు అవసరమవుతాయని నివేదికలో వెల్లడించారు. అదే సమయంలో సిబ్బంది కూడా ముఖ్యమన్నారు. దాదాపు 11,500 మంది సిబ్బందిని నియమించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో 5వేల మంది డ్రైవర్లు, మరో 5వేల మంది కండక్టర్లు, 1500 మంది మెకానిక్‌లు, ఇలా మొత్తంగా 11,500 మంది సిబ్బంది అవసరం అవుతారని భావిస్తున్నారు.

అలాగే ఎంత రాబడి తగ్గుతుంది, ఏఏ బస్సులకు డిమాండ్ ఉంటుందనే వివరాలతో ప్రభుత్వానికి నివేదికను అందించారు. ఇక ఈ పథకాన్ని అధ్యయనం చేసేందుకు ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఫ్రీ బస్ ప్రయాణం తీరును అధికారులు పరిశీలించనున్నారు. దీనిపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో రీసెంట్‌గా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం అధికారులిచ్చిన నివేదిక చూసి ఇతర రాష్ట్రాల ఫ్రీ బస్ పథకం తీరును పరిశీలించనుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆర్టీసీ నుంచి రోజు వారి రాబడి రూ.16 కోట్ల నుంచి రూ.17 కోట్ల వరకు వస్తోంది. అందులో మహిళా ప్రయాణికుల నుంచి దాదాపు రూ6-7 కోట్లు. మరి ఫ్రీ బస్ ప్రయాణం అమలులోకి వస్తే ఆ రాబడి మరి రాదు. అంతేకాకుండా నెలకు సగటును రూ.200 కోట్లు ఆర్టీసీ కోల్పోతుంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *