APPSC DL Jobs : ఆంధ్రప్రదేశ్‌లో మరో 240 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. విభాగాల వారీగా ఖాళీల వివరాలివే
APPSC Degree Lecturer Jobs : ఆంధ్రప్రదేశ్‌లో వరుస జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో లెక్చరర్ పోస్టులకు కూడా మూడు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వివరాల్లోకెళ్తే..
ప్రధానాంశాలు:
- ఏపీపీఎస్సీ జాబ్ రిక్రూట్‌మెంట్ 2024
- 240 డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన
- జనవరి 24 నుంచి దరఖాస్తులు ప్రారంభం
- ఫిబ్రవరి 13 దరఖాస్తులకు చివరితేది
ఏపీ డీఎల్ నోటిఫికేషన్ 2024
APPSC Degree Lecturers 2023 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు సంబంధించి ఏపీపీఎస్సీ డిసెంబర్ 30వ తేదీ (శనివారం)నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 240 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ అధికారులు వెల్లడించారు.
ఇటీవలే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 47, పాలిటెక్నిక్ కాలేజీల్లో 99 లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత, వయసు, జీతం తదితర వివరాలను జనవరి 24వ తేదీ లోపు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.
మొత్తం డిగ్రీ లెక్చరర్ పోస్టులు: 240
- బోటనీ- 19
- కెమిస్ట్రీ- 26
- కామర్స్- 35
- కంప్యూటర్ అప్లికేషన్స్- 26
- కంప్యూటర్ సైన్స్- 31
- ఎకనామిక్స్- 16
- హిస్టరీ- 19
- మ్యాథమెటిక్స్- 17
- ఫిజిక్స్- 11
- పొలిటికల్ సైన్స్- 21
- జువాలజీ- 19
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, నెట్/ స్లెట్/ సెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
- ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి.
- దరఖాస్తులు ప్రారంభతేదీ: జనవరి 24, 2024
- దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 13, 2024
- రాత పరీక్ష తేదీ: ఏప్రిల్/ మే, 2024.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://psc.ap.gov.in/