AP SI Results : ఎస్సై ఫలితాల విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేత

 AP SI Results : ఎస్సై ఫలితాల విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేత

AP SI Results : ఎస్సై నియామకాలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏపీ హైకోర్టు ఎత్తివేసింది. దీంతో ఎస్సై ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది.

AP SI Results : ఏపీలో ఎస్సై ఫలితాలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎస్సై నియామకాలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసినట్లు హైకోర్టు తెలిపింది. ఎస్సై ఫలితాలను విడుదల చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది. ఎస్సై నియామకాల్లో ఎత్తు, కొలతల అంశంలో అవకతవకలు జరిగాయని అభ్యర్థుల తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణలో ఎస్సై నియామకాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు. తాజాగా ఈ ఉత్తర్వులను ఎత్తివేసింది.

ఎస్సై నియామకాల్లో ఎత్తు, కొలతల అంశంలో అవకతవకలు జరిగాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యంతరం తెలిపిన అభ్యర్థుల ఎత్తు, కొలతలను న్యాయమూర్తి సమక్షంలో నిర్వహించారు. నియామక బోర్డు కొలతలు, న్యాయమూర్తి సమక్షంలో తీసుకున్న కొలతలు సరిపోవడంతో అభ్యర్థుల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఎస్సై ఫలితాలు విడుదలకు లైన్ క్లియర్ అయింది.

అభ్యర్థుల పిటిషన్

ఎస్సై నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఎత్తు, కొలతల అంశంలో గతంలో అర్హులైన వారిని, ఇప్పుడు అనర్హులుగా ప్రకటించారని అభ్యర్థులు కోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఎస్సై నియామకాలపై ఇటీవల స్టే విధించింది. అయితే ఎస్సై నియామకాలపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన స్టేను ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో సవాల్ చేసింది. ఎస్సై అభ్యర్థులకు ఎత్తు, కొలతల అంశంలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని కోర్టుకు తెలిపారు. 45 వేల మంది అభ్యర్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని స్టే ఎత్తివేయాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. తమ సమక్షంలో అభ్యర్థుల కొలతలు చేపట్టాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

హైకోర్టు సమక్షంలో కొలతలు

హైకోర్టు బృందం సమక్షంలో అభ్యర్థులకు ఎత్తు, కొలతలను కొలుస్తామని ప్రభుత్వం అంగీకరించింది. అయితే అభ్యర్థులు తప్పుడు ఆరోపణలు చేస్తే ఒక్కో అభ్యర్థికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తామని కోర్టు హెచ్చరించింది. ఇవాళ జడ్జి సమక్షంలో ప్రభుత్వ వైద్యుడితో అభ్యర్థుల ఎత్తు కొలిచారు. అయితే అభ్యర్థుల ఎత్తు సరిపోవడంతో హైకోర్టు అభ్యర్థుల పిటిషన్ ను కొట్టివేసింది. ఎస్సై ఫలితాల విడుదలకు అనుమతి ఇచ్చింది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *