AP SI Recruitment: ఆన్‌లైన్‌లో ఏపీ ఎస్సై రిక్రూట్‌మెంట్‌ మెయిన్స్‌ హాల్‌టిక్కెట్స్

 AP SI Recruitment: ఆన్‌లైన్‌లో ఏపీ ఎస్సై రిక్రూట్‌మెంట్‌ మెయిన్స్‌ హాల్‌టిక్కెట్స్

Oct 06, 2023 07:31 AM IST
Share on Twitter
Share on Facebook
Share on Whatsapp
మమ్మల్ని ఫాలో అవ్వండి
AP SI Recruitment: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్సై రిక్రూట్‌మెంట్‌ తుది రాత పరీక్ష హాల్‌టికెట్లను శుక్రవారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకూ ఆన్‌లైన్‌‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ అతుల్‌సింగ్‌ ప్రకటించారు.
AP SI Recruitment: ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చేపట్టిన నియామకాల్లో ఎస్సై తుది రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను శుక్రవారం నుంచి అందుబాటులో ఉంటాయి. ఈ నెల 12వ తేదీ వరకూ ఆన్‌లైన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్‌ పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ అతుల్‌సింగ్‌ తెలిపారు.

రాష్ట్రంలో ఎస్‌ఐ పోస్టుల భర్తీ కోసం ఈనెల 14, 15 తేదీల్లో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించాలని పోలీస్‌ నియామక మండలి నిర్ణయించింది.ఏపీలోని విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు నగరాల్లోని కేంద్రాల్లో తుది రాతపరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హాల్‌టికెట్లు పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ప్రకటించారు.

ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు పేపర్లు, డిస్క్రిప్టివ్‌ విధానంలో రెండు పేపర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. మెయిన్స్‌కు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31,193 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారిలో పురుషులు 27,590 మంది, మహిళలు 3,603 మంది ఉన్నారు.మెయిన్స్‌ పరీక్షలను విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను ఈ నెల 6 నుంచి 12 వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పేపర్‌-1(డిస్క్రిప్టివ్‌), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకు పేపర్‌-2(డిస్క్రిప్టివ్‌) నిర్వహిస్తారు.

15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పేపర్‌-3(ఆబ్జెక్టివ్‌), మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పేపర్‌-4(ఆబ్జెక్టివ్‌) నిర్వహించనున్నారు. slprb. ap. gov. in వెబ్‌సైట్‌ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

మెయిన్స్‌ రాపరీక్ష నిర్వహణపై ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను లేదంటే ఈమెయిల్‌ mail& slprb@ap.gov.in ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.

 

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *