AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు

 AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీకి మరో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి మూడోసారి మోదీ ప్రధాని అయ్యారు. అలాగే చంద్రబాబు కూడా వరుసగా మూడు సార్లు సీఎం కావాలి. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు.

AP News:  ఏపీకి మరో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి మూడోసారి మోదీ ప్రధాని అయ్యారు. అలాగే చంద్రబాబు కూడా వరుసగా మూడు సార్లు సీఎం కావాలి. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు.

చంద్రబాబు నుంచి నేర్చుకోవాలి..

ఈ మేరకు చంద్రబాబు నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని -పవన్‌ అన్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడుతూ.. కౌరవ సభని గౌరవ సభగా మార్చి వస్తానని శపదం చేశానని, అలాగే గౌరవ సభగా మార్చి చూపించామని చెప్పారు. ఒక అర్ధవంతమైన శాసన సభలు జరిగాయి. ప్రతి ఒక్క శాసన సభ్యుడు మంచి అవగాహనతో సభలో మాట్లాడారు. అలాగే ప్రతి ఒక్క ఎమ్మెల్యే లు మళ్ళి గెలిచేలా మంచి పేరు తెచ్చుకోవాలి. దశాబ్దాల పోరాటాల తర్వాత వర్గీకరణ బిల్లు ని విజయవంతంగా శాసన సభల్లో ప్రవేశపెట్టామని ప్రభుత్వ గొప్పతనం గురించి వివరించారు.

SAAP విజయవంతం..

అలాగే ఏపీ రాజకీయ నేతల కల్చర్ ప్రోగ్రామ్ సంబందించిన బహుమతులు గెలిచిన శాసన సభ్యులకి ఇవ్వడం మంచి పరిణామం అన్నారు.  ఇవ్వాళా శాసన సభ్యుల చేసిన నటనకు సీఎం చంద్రబాబు, నేను బాగా నవ్వుకున్నాం. బలమైన నాయకుడైన చంద్రబాబుకి నవ్వు కలిపించినందుకు ధన్యవాదాలు. మంచి ఆహ్లాదన్ని ఇచ్చింది. ఇంటికి వెళ్లి మరి నవ్వుకునే సందర్భాలు కలిగించాయి. రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించే నాయకత్వంతో కూటమి ప్రభుత్వం ఉంటుంది. దుర్యోదణుడిగా అలరించిన డిప్యూటీ స్పీకర్ రఘు రామరాజు కి కృతజ్ఞతలు. చిన్నప్పుడినుంచి నాకు క్రీడలు తెలియదు. మొట్టమొదటి సారి నాకు కూడా పోటిల్లో పాల్గొనాలనిపించింది. వచ్చే సంవత్సరం పోటిల్లో పాల్గొంటా. అందరికి ఒక మంచి స్ఫూర్తి ని ఇచ్చింది. SAAP విజయవంతంగా ఈ పోటీలని నిర్వహించింది. వారికీ ప్రత్యేక ధన్యవాదాలు. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే అనేక పర్యాయలు కూటమి ప్రభుత్వం పనిచేయాలని ఆయన అన్నారు.

అలాగే ఏపీలో రాజకీయ నేతల రోజు ఎంతో ఉత్సాహంగా అయ్యన పాత్రులు కనిపిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ ఏ డైలాగ్ చెప్పారో అలాగే RRR అలా నిండుగా చెప్పారని కొనియాడారు. ఎన్నడూ లేని విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసాం. పవన్ కళ్యాన్ సినిమాల్లో కూడా ఇంత వినోదం వచ్చుండదు. వినోదంతో పాటు మంచి సందేశలతో మంచి స్కిట్లు చేసారు. ఈశ్వరరావు చేసిన పెర్ఫార్మన్స్ తో నేనెప్పుడూ నవ్వలేని విధంగా నవ్వించారని కొనియాడారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *