AP Endowments: ఆంధ్రప్రదేశ్‌లో ఏఈఈ, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల

 AP Endowments: ఆంధ్రప్రదేశ్‌లో ఏఈఈ, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల

Andhra Pradesh Endowments Department : ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా జాబ్‌ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా దేవదాయశాఖలో ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.

ప్రధానాంశాలు:

  • ఏపీ ఎండోమెంట్స్‌ రిక్రూట్‌మెంట్‌
  • 70 ఏఈఈ, టీఏ పోస్టుల భర్తీకి ప్రకటన
  • జనవరి 5వ తేదీ వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు
AP Endowments Department Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దేవదాయ శాఖ (AP Endowments Department)లో.. ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన 70 ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో 35 ఏఈఈ (సివిల్‌), 5 ఏఈఈ (ఎలక్ట్రికల్‌), మరో 30 టెక్నికల్‌ అసిస్టెంట్‌ (సివిల్‌) పోస్టులున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందూ మతస్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 2024, జనవరి 5 దరఖాస్తులకు చివరితేది.

మొత్తం ఖాళీలు – 70

  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 35
  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 05
  • టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్): 30

AP AHA Hall Ticket 2023 : ఏపీ పశుసంవర్ధక శాఖలో 1896 ఉద్యోగాలు.. రేపే హాల్‌టికెట్లు విడుదల

ముఖ్య సమాచారం :

  • అర్హత: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎల్‌సీఈ డిప్లొమా, ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్‌ (సివిల్/ఎలక్ట్రికల్) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 ఏళ్లు సడలింపు ఉంటుంది.
  • వేతనం: నెలకు ఏఈఈకి రూ.35,000; టీఏకు రూ.25,000తో పాటు అదనపు అలవెన్సులుంటాయి.
  • ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు ఫీజు: రూ.500గా నిర్ణయించారు.
  • దరఖాస్తు విధానం: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తి చేసి, సంబంధిత ధ్రువపత్రాల జిరాక్స్‌ కాపీలను ది కన్వీనర్‌, రిక్రూట్‌మెట్‌ సర్వీస్‌, పవర్‌ అండ్‌ ఎనర్జీ డివిజన్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, గచ్చిబౌలి, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి.
  • దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: జనవరి 05, 2024.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి

Dy.EO: ఆంధ్రప్రదేశ్‌లో DEO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలివే

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *