AP 10th Class State Topper 2025: టెన్త్ ఫలితాల్లో కాకినాడ బాలిక సత్తా.. ఏకంగా 600కి 600 మార్కులు వచ్చాయ్!

పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) ఉదయం 10 గంటలకు విద్యశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. పదో తరగతి ఫలితాల్లో ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు 81.14 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే కాకినాడకు చెందిన ఓ బాలిక మాత్రం ఒక్కమార్కు కూడా వదలకుండా..
కాకినాడ, ఏప్రిల్ 25: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో కాకినాడకు చెందిన నేహాంజని అనే విద్యార్ధినికి 600కి ఏకంగా 600 మార్కులు వచ్చాయి. నగరంలోని భాష్యం పాఠశాలలో నేహాంజని పదో తరగతి చదువుతోంది. తాజా ఫలితాల్లో విద్యార్ధిని ఒక్క మార్కు కూడా తగ్గకుండా స్టేట్ టాప్ ర్యాంకు సాధించింది. దీంతో విద్యార్ధినిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
పదో తరగతిలో 600కి 600 మార్కులు సాధించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్ధిని మీడియాకు తెలిపింది. 600 మార్కులు వస్తాయని ఊహించలేదని, ఐఐటీ ముంబైలో చదువుతానని పేర్కొంది. ఐఏఎస్ కావాలని అనుకుంటున్నట్లు పేర్కొనింది. లాంగ్వేజెజ్‌లో 100కి 100 మార్కులు కోసం చాలా హార్డ్ వర్క్ చేశానని తెలిపింది. పేరెంట్స్, టీచర్స్ ఎంతో సపోర్ట్ చేశారని, వారందరి సహకారంతోనే ఉత్తమ ఫలితాలు వచ్చాయని నేహంజలి తెలిపింది. కాగా నేహాంజని తండ్రి శ్రీనివాసరావు ప్రైవేట్ ఉద్యోగి, తల్లి గంగాభవానీ గృహిణి. తమ విద్యార్థిని వై నేహాంజని స్టేట్ టాపర్‌గా నిలవడం పట్ల భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు ఎలమంచిలి శ్రీచైతన్య స్కూల్‌లో చదువుతున్న ఎండ అనీష అనే విద్యార్థిని 600 మార్కులకు 599 మార్కులు సాధించింది. అలాగే పల్నాడు జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పావని చంద్రిక విద్యార్థినికి 598 మార్కులు వచ్చాయి. ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న పావని చంద్రిక అత్యధిక స్కోర్ సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది. పాఠశాల హెచ్‌ఎం విజయ లలిత, తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు పావని చంద్రికను అభినందనలతో ముంచెత్తారు. ఇటీవల విడుదలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి ఫలితాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అత్యధికంగా 81.14 శాతం ఉత్తీర్ణత నమోదైన సంగతి తెలిసిందే.