Anganwadis Calloff: అంగన్‌వాడీల సమ్మె విరమణ..చర్చలు సఫలం
Anganwadis Calloff: ఏపీ ప్రభుత్వంతో అంగన్ వాడీ సంఘాలు జరిపిన చర్చలు సోమవారం రాత్రి కొలిక్కి వచ్చాయి. అంగన్‌వాడీల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

Anganwadis Calloff: ఏపీలో 42రోజులుగా సాగుతున్న అంగన్‌వాడీల సమ్మె ఎట్టకేలకు ముగిసింది. డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.
ట్రెండింగ్ వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ మంత్రి వర్గ ఉపసంఘంతో సోమవారం అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు ఫలించినట్టు ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్య నారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృ ష్ణారెడ్డి, ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అంగన్ వాడీల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
అంగన్‌వాడీ ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉందని మంత్రి బొత్స చెప్పారు. సమ్మెలో భాగంగా అంగన్ వాడీలు పెట్టిన 11 డిమాండ్లలో 10 అంగీకరించడంతో పాటు, వాటిలో చాలా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని చెప్పారు.
వేతనాల పెంపుపై ఇటు ప్రభుత్వం.. అటు అంగన్‌వాడీ యూనియన్లు పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నామ న్నారు. ఈ ఏడాది జూలై నుంచి అమలు చేసే దిశగా పని చేస్తున్నామని తెలిపారు. ‘అంగన్‌వాడీల ప్రయోజనాలు కాపాడటంతో పాటు వారి సంక్షేమం దృష్ట్యా వర్కర్లకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ రూ.50 వేల నుంచి ఏకంగా రూ.1.20 లక్షలకు, హెల్పర్లకు రూ.20 వేల నుంచి రూ.60 వేలకు పెంచుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వంతో గ్రాట్యుటీ అంశంపై చర్చలు జరుపుతామన్నారు. భవిష్యత్తులో అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ నియమిస్తామన్నారు. ముఖ్య మంత్రి వైఎస్ జగన్ దృష్టికి నమ్మె కాలంలోని అంగన్‌వాడీల వేతనం, పోలీసు కేసుల అంశం తీసుకెళ్లి.. న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. దాదాపు అన్ఇని డిమాండ్లను ప్రభుత్వం అమోదించిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్త శుద్ధికి నిదర్శనం’ అన్నారు.
విధుల్లోకి వెళుతున్నట్లు ప్రకటన…
ప్రభుత్వంతో చర్చలు సుహృ ద్భావ వాతావరణంలో విజయవంతం అయ్యా యని అంగన్వాడీ యూనియన్ నాయకులు ప్రక టించారు. తాము విధుల్లోకి వెళ్లనున్నట్టు తెలిపారు. వేతనాల పెంపు విషయంలో దీర్ఘకాలిక పోరాటానికి పరిష్కారం లభించిందన్నారు. సర్వీ సులో ఉండి అంగన్వాడీలు చనిపోతే మట్టి ఖర్చు లు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారని వివరించారు.
యాప్‌ల డేటా అప్డేట్ చేసే భారాన్ని సైతం తగ్గిచేందుకు స్పష్టమైన హామీ లభించిందన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ బిల్లులు, గ్యాస్ మెనూ పెంపు, చిన్నారుల మెనూ పెంచాలని కోరగా ప్రత్యేక కమిటీలో చర్చించి నిర్ణ యిస్తామని చెప్పారన్నారు.
అంగన్వాడీలకు ప్రభు త్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయడానికి చర్య లు చేపడతామని మంత్రులు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల రాష్ట్ర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

