Allu Arjun: జాతీయ అవార్డ్ వచ్చాక మొదటిసారి స్పందించిన అల్లు అర్జున్.. తన భార్య రియాక్షన్ ఏంటంటే..

 Allu Arjun: జాతీయ అవార్డ్ వచ్చాక మొదటిసారి స్పందించిన అల్లు అర్జున్.. తన భార్య రియాక్షన్ ఏంటంటే..

నేషనల్ బెస్ట్ యాక్టర్ గా బన్నీకి అవార్డ్ రావడంతో ఇటు అల్లు ఫ్యామిలీతోపాటు మెగా కుటుంబంలోనూ సంతోషాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న మొదటి హీరో బన్నీ కావడంతో గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతుంది. సినీ, రాజకీయ ప్రముఖులు బన్నీకి అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత మొదటిసారి మీడియాతో ముచ్చటించారు బన్నీ.

ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. దాదాపు 10 పురస్కారాలను గెలుచుకుని తెలుగు సినిమా రేంజ్ ఏంటో చాటి చెప్పాయి. అందులోనూ ఇప్పటివరకు ఏ ఒక్క తెలుగు నటుడు అందుకోని అరుదైన గౌరవం బన్నీకి చేరింది. ఆయన నటించిన పుష్ప సినిమాకుగానూ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా బన్నీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నేషనల్ బెస్ట్ యాక్టర్ గా బన్నీకి అవార్డ్ రావడంతో ఇటు అల్లు ఫ్యామిలీతోపాటు మెగా కుటుంబంలోనూ సంతోషాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న మొదటి హీరో బన్నీ కావడంతో గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతుంది. సినీ, రాజకీయ ప్రముఖులు బన్నీకి అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత మొదటిసారి మీడియాతో ముచ్చటించారు బన్నీ.

ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.. “పుష్ప సినిమాకు చాలా విభాగాల్లో నామినేషన్స్ వేశాం. ఎవరికీ అవార్డ్ వస్తుందో అనే ఆత్రుత ముందు నుంచి ఉంది. అందుకే పురస్కారాలు ప్రకటించేరోజు దర్శకనిర్మాతలు, మేము అంతా ఒక్కచోటే ఉండి టీవీ ముందు కూర్చున్నాం. ఉత్తమ నటుడి విభాగంలో నా పేరు తెరపై కనిపించగానే ఆనందంతో సుకుమార్ ను గట్టిగా హత్తుకున్నాను. ఈ పురస్కారం రావడానికి ఉన్న కారణాలన్ని కేవలం సుకుమార్ కే. తనే నాకు ఈ అవార్డ్ రావాలని వంద రెట్లు కోరుకున్నాడు. ఇది నా పురస్కారం కంటే తనకు వచ్చిందే అవుకోవాలి. నేనొక వైర్ అయితే అందులో కరెంట్ నువ్వే అని తనతో చెప్పాను. వైర్ కాదు డార్లింగ్.. ఫైర్ నువ్వు అని సుకుమార్ అన్నాడు” అంటూ చెప్పుకొచ్చారు బన్నీ.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *