Akhanda2 Teaser: అఖండ-2 టీజర్ వచ్చేసింది.. బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలే!

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగవ చిత్రం అఖండ-2 టీజర్ వచ్చేసేంది. అఖండకు మించిన యాక్షన్, డైరెక్షన్, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పార్ట్-2లో ఉంటుందని టీజర్ ను చూస్తే అర్థం అవుతోంది.
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగవ చిత్రం అఖండ-2 టీజర్ వచ్చేసేంది. అఖండకు మించిన యాక్షన్, డైరెక్షన్, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పార్ట్-2లో ఉంటుందని టీజర్ ను చూస్తే అర్థం అవుతోంది. ‘నా శివుడి ఆజ్ఞ లేనిదే ఆ యుముడు కూడా కన్నెత్తి చూడడు.. నువ్వు చూస్తావా?’ అంటూ అఖండ పాత్రలో బాలయ్య చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. త్రిశూలంతో హిమాలయాల్లో బాలయ్య చేసే ఫైట్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఇప్పటికే సింహా, లెజెండ్, అఖండ సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ కావడం విశేషం. కరోనా విజృంభిస్తూ థియేటర్లకు జనం వచ్చేందుకు భయపడుతున్న సమయంలో విడుదలైన అఖండ.. సంచలన విజయం సాధించింది. కరోనా భయాన్ని వీడి థియేటర్లకు జనాన్ని క్యూకట్టేలా చేసింది.
ముఖ్యంగా అఖండ క్యారెక్టర్లో బాలయ్య నటన ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. బాలయ్య రేంజ్ యాక్షన్, బోయపాటి స్టైల్ డైరెక్షన్ కు తమన్ అదిరిపోయే మ్యూజిక్ మరింత ప్లస్ అయ్యింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను కట్టిపడేసింది. తమన్ మ్యూజిక్ దెబ్బకు కొన్ని థియేటర్లలో సౌండ్ బాక్సులు పేలిపోయాయంటే.. ఏ రేంజ్ లో వాయించాడో అర్థం చేసుకోవచ్చు. ఈ సారి కూడా అదే రేంజ్ లో మ్యూజిక్ ఉంటుందని టీజర్ లోనే హింట్ ఇచ్చాడు తమన్.