Aghori Case : వర్షిణి విడుదల .. జైల్లోనే అఘోరీ శ్రీనివాస్ !

 Aghori Case : వర్షిణి విడుదల .. జైల్లోనే అఘోరీ శ్రీనివాస్ !

అఘోరీ శ్రీనివాస్ భార్య వర్షిణి విడుదల అయింది.  గచ్చిబౌలి రీహాబిలిటేషన్‌ సెంటర్‌ నుంచి ఆమె  శుక్రవారం రిలీజ్ అయింది. దాదాపు 45 రోజుల తర్వాత వర్షిణి బయట ప్రపంచాన్ని చూస్తుంది.

అఘోరీ శ్రీనివాస్ భార్య వర్షిణి విడుదల అయింది.  గచ్చిబౌలి రీహాబిలిటేషన్‌ సెంటర్‌ నుంచి ఆమె  శుక్రవారం రిలీజ్ అయింది. దాదాపు 45 రోజుల తర్వాత వర్షిణి బయట ప్రపంచాన్ని చూస్తుంది. మరోవైపు వర్షిణిని తలుచుకుంటూ జైళ్లోనే అఘోరీ శ్రీనివాస్ ఒంటరి జీవితం గడుపుతున్నాడు. తనకు వర్షిణిని చూపించాలంటూ ఏడుస్తున్నాడు.  గత ఏడాది నుంచి లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సనాతన ధర్మం అంటూ.. మహిళలపై జరుగుతున్న అఘోయిత్యాల కోసం తాను పోరాడుతానని ఏపీ, తెలంగాణలో తెగ తిరిగేశాడు. ఆ సమయంలో పలువురితో గొడవలకు దిగాడు. అక్కడితో ఆగకుండా పోలీస్ అధికారులపై సైతం దాడులు చేశాడు. అందుకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి.

వర్షిణీని ప్రేమించి పెళ్లి

ఎప్పుడైతే వర్షిణీతో ప్రేమలో పడ్డాడో అప్పటి నుంచి అఘోరీ జీవితం పూర్తిగా మారిపోయింది. వర్షిణీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలోనే మరో మహిళ అతడిపై కేసు వేసింది. తానే మొదటి భార్యనని రాధిక అనే మహిళ మీడియా ముందుకు రావడం సంచలనం రేపింది. అది మాత్రమే కాకుండా ఓ సినిమా ప్రొడ్యూసర్ సైతం అఘోరీపై కేసు వేసింది. పూజలు పేరుతో తనను బెదిరించి రూ.10 లక్షలు తీసుకున్నాడని కేసు వేయడంతో పోలీసులు అఘోరీని అరెస్టు చేశారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైల్లోనే ఉంచారు. ఇటీవలే మోకిలా, కొమురవెళ్లి కేసుల్లో అఘోరీకి బెయిల్‌ వచ్చింది. కానీ తన మొదటి భార్య రాధిక పెట్టిన కేసులో ఇంకా బెయిల్ రాలేదు. దీంతో జైల్లోనే ఉంచారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *