Actor Sivaji: బిగ్ బాస్‌ను ఎదిరించిన శివాజీ.. బూతులు తిడుతూ రచ్చ.. బిడ్డలపై ఒట్టు వేసి మరి!

 Actor Sivaji: బిగ్ బాస్‌ను ఎదిరించిన శివాజీ.. బూతులు తిడుతూ రచ్చ.. బిడ్డలపై ఒట్టు వేసి మరి!

Oct 06, 2023 06:53 AM IST
Share on Twitter
Share on Facebook
Share on Whatsapp
మమ్మల్ని ఫాలో అవ్వండి
Bigg Boss 7 Telugu Sivaji: బిగ్ బాస్ 7 తెలుగు అక్టోబర్ 5వ తేది ఎపిసోడ్‌లో ఫైనల్ కంటెండర్ టాస్క్ ఇచ్చాడు పెద్దయ్య. అయితే, మొదటి నుంచి అసహనంగా ఉన్న శివాజీని బిగ్ బాస్‌ను ఎదిరిస్తూ, బూతులు తిడుతూ రచ్చ చేశాడు. ఇంకా గురువారం నాటి ఎపిసోడ్ హైలెట్స్ చూస్తే..
Bigg Boss 7 Telugu October 5th Episode: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ప్రారంభమై ఐదు వారాలు కావొస్తుంది. కానీ, ఇప్పటి వరకు ఇంటికి కెప్టెన్సీ టాస్క్ నిర్వహించలేదు. తొలిసారి కెప్టెన్సీ టాస్క్ నిర్వహించిన బిగ్ బాస్ గత ఎపిసోడ్‌లో ఫైనల్ కంటెండర్షిప్ కోసం పోటీ పెట్టాడు. అయితే, పోటీ కంటే ముందు బిగ్ బాస్‌ను తిడుతూ హీరో శివాజీ రచ్చ చేశాడు. ఇదివరకు మొదటి వారంలో బొక్కలో బిగ్ బాస్ అంటూ బూతులు తిట్టిన శివాజీ మరోసారి చుక్కలు చూపించాడు.

బొక్కలో నుంచి
కాఫీ విషయంలో బిగ్ బాస్‌తో విభేదించాడు హీరో శివాజీ. కొంతమంది పక్కకు వెళ్లి సైలెంట్‌గా కూర్చుని రిలాక్స్ అవుతారు. అది వాళ్ల అలవాటు. నాకు కాఫీ తాగడం అలవాటు. నేను మళ్లీ అడగను. ఇచ్చాడా ఇస్తాడు. లేదంటే వెళ్లిపోతా. నిజంగా నేను ఏం ఆలోచించలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. కాఫీ ఇవ్వకుండా కామెడీ చేయమంటే ఎట్టా చేస్తాం. బొక్కలో నుంచి వస్తుందా కామెడీ. వీడెవడ్రా.. కాఫీ ఇవ్వనంటాడు అని తేజ, శుభ శ్రీతో శివాజీ అన్నాడు.

నాలుగు జంటలు
అనంతరం కెప్టెన్సీ కంటెండర్ టాస్కులో ఎవరు లీడ్‌లో ఉన్నారు. ఎవరు తొలిగిపోతున్నారో చెప్పమని శుభ శ్రీకి ఆదేశించాడు బిగ్ బాస్. దీంతో అధికంగా 5 స్టార్స్ తో శివాజీ, ప్రశాంత్ లీడ్‌లో ఉన్నట్లు శుభ శ్రీ చెప్పింది. ప్రియాంక, శోభాలు తక్కువ స్టార్సుతో తొలగిపోయినట్లు తెలిపింది. నాలుగు జంటలు అయిన శివాజీ-ప్రశాంత్, శుభ శ్రీ-గౌతమ్, అమర్-సందీప్, ప్రిన్స్-యావర్‌లకు చిట్టీ యాయిరే అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

లెటర్ చదివిన వ్యక్తి
పోటీలో ఉన్న జంటల ఇంటి వాళ్ల నుంచి లెటర్స్ వచ్చాయని.. వాటిలో పెయిర్‌లోని ఒక కంటెస్టెంట్ మాత్రమే లెటర్ చదివే అవకాశం ఉందని బిగ్ బాస్ చెప్పాడు. మరొకరు లెటర్ చదవడాన్ని త్యాగం చేయాలని, వాళ్లు తమ లెటర్‌ను క్రష్ చేయడంతో పాటు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం కోల్పోతారని బిగ్ బాస్ చెప్పాడు. అంటే లెటర్ పొంది చదివిన వ్యక్తి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలుస్తాడు.

నిన్నే చేద్దామని
అయితే, ఈ టాస్క్ గురించి చెప్పగానే నేను ఈ టాస్క్ ఆడటం లేదు బిగ్ బాస్ అని మైక్ తీసు సోఫా లోనుంచి లేచి బయటకు వెళ్లిపోయాడు హీరో శివాజీ. కాఫీ పంపించలేదన్న కోపంతోనే శివాజీ అలా చేసినట్లుగా అర్థం అవుతోంది. తర్వాత ప్రశాంత్, తేజ వచ్చి మాట్లాడారు. నువ్వు (ప్రశాంత్) వెళ్లు బిడ్డా.. ఆడు. మనస్ఫూర్తిగా చెబుతున్నా. అసలు ఇది కాకపోయినా నిన్నే కెప్టెన్ చేద్దాం అనుకున్నా. నా బిడ్డలపై ఒట్టు. వెళ్లి ఆడు పో.. అని ప్రశాంత్‌తో చెప్పాడు శివాజీ.

నోరు మూసుకుని
అయితే, ఇంతా చేస్తున్న శివాజీని బిగ్ బాస్ ఏమాత్రం వారించలేదు.ఏం అనకుండా సైలెంట్‌గా ఉండిపోయాడు. టాస్క్ ఆడను అంటే సాధారణంగా ఆడమంటూ బిగ్ బాస్ చెబుతాడు. కానీ, శివాజీని కెలికితే ఏమైనా బూతులు తిడాతాడనో, కాఫీ గురించి వాదిస్తాడనో.. అసలు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక నోరు మూసుకున్నాడు పెద్దయ్య.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *