Telangana: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై కీలక అప్‌డేట్
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. పంచాయతీల్లో ఓటరు జాబితాను మరోసారి సవరణ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. పంచాయతీల్లో ఓటరు జాబితాను మరోసారి సవరణ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయం తీసుకుంది. 20వ తేదీన ఓటర్ల దరఖాస్తు, అభ్యంతరాల స్వీకరణ, తప్పుల సవరణ చేపట్టాలని ఈసీ ఉత్తర్వుల్లో తెలిపింది. 21న అభ్యంతరాల పరిష్కారం, 23న తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని పేర్కొంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని.. జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.