Crime news: టాలీవుడ్ నటి డింపుల్ హయతీపై కేసు..పనిమనిషిని క్రూరంగా….

 Crime news: టాలీవుడ్ నటి డింపుల్ హయతీపై కేసు..పనిమనిషిని క్రూరంగా….

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీ పై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హీరోయిన్ డింపుల్ హయాతి జీతం విషయంలో పని మనిషిని ఇష్టం వచ్చినట్లు తిట్టినట్లు ఆరోపణలున్నాయి.

Case filed against Tollywood actress Dimple Hayati

 

Crime news: టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీ పై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. టాలీవుడ్ ఐటెం గర్ల్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ డింపుల్ హయాతి జీతం విషయంలో పని మనిషిని ఇష్టం వచ్చినట్లు తిట్టినట్లు ఆరోపణలున్నాయి. తరచుగా వివాదాల్లో చిక్కుతున్న హయతి మరోసారి వివాదంతో వార్తల్లోకి ఎక్కింది. గద్దలకొండ గణేష్‌లో “జర్రా జర్రా” పాటతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డింపుల్, ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా సంద‌డి చేయ‌క‌పోయింది, కానీ… వివాదాల్లో మాత్రం తరచూ మీడియాలో హైలైట్ అవుతోంది. తాజాగా ఆమె త‌న ఇంటి పనిమనుషులపై హింసాత్మకంగా ప్రవర్తించారనే  ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. డింపుల్ ఇప్పటి వరకు చేసిన చిత్రాలు పెద్దగా హిట్ కాలేదు కాని, ఆమెకి సంబంధించిన‌ వివాదాలు మాత్రం ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె అసభ్య ప్రవర్తన, వాహనాన్ని డ్యామేజ్ చేశార‌నే దానిపై ఐపీఎస్ అధికారి కేసు న‌మోదు చేశారు.

తాజాగా పనిమనుషులను’నా చెప్పుల విలువ కాదు.. నీ బ్రతుకు’ అంటూ.. దూషించడమే కాకుండా.. అకారణంగా దాడి చేసినట్టు ఇంట్లో పనిచేసే అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పనిమనిషి ఫిర్యాదుతో హీరోయిన్ డింపుల్ హయతీ తో పాటు ఆమె భర్త మీద కూడా క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. హయతీ త‌న పెంపుడు కుక్కలను చూసుకునేందుకు ఒడిషాకు చెందిన ఇద్దరు యువతులను పని కోసం తీసుకువచ్చిందట డింపుల్‌. కానీ వారికి వేతనం ఇవ్వకపోవడం, అసభ్య పదజాలంతో దూషించడం, భయపెట్టడం వంటివి చేసింద‌నే ఆరోపణలు వస్తున్నాయి.‘మీరు నా చెప్పులంత వాల్యూ చేయరు.. మీరు ఎంత? మీ బ్రతుకెంత?’ అంటూ సదరు అమ్మాయిలతో డింపుల్‌ భర్త దురుసుగా ప్రవర్తించారని వారు ఫిర్యాదు చేశారు, అంతేకాక జీతం అడిగితే ఇంట్లో నుండి బ‌య‌ట‌కు గెంటేశార‌ట‌. ఇక నా భ‌ర్త లాయ‌ర్. న‌న్ను ఏమి చేయ‌లేరు అంటూ డింపుల్ స‌ద‌రు అమ్మాయిల‌పై దారుణంగా దూషించారని  ఓ మ‌హిళ వీడియోలో తెలియ‌జేసింది. కుక్క అరిచిందని చెప్పి తనను నగ్నంగా చేసి కొట్టేందుకు ప్రయత్నించారని పనిమనిషి ఆరోపణలు చేసింది. తన నగ్న వీడియోలు తీసేందుకు ప్రయత్నించారని పనిమనిషి ఆరోపణలు చేసింది.

మొన్నటి వ‌ర‌కు హెల్త్ ఇష్యూల‌తో స‌త‌మ‌వుతూ ఏడాదికి పైగా సినిమాల‌కు దూరంగా ఉన్న డింపుల్ ఇప్పుడు సినిమా అవ‌కాశాల కోసం ట్రై చేస్తూనే ఎక్కువ‌గా వివాదాల‌లో నిలుస్తూ వ‌స్తుంది. సినిమాల క‌న్నా వివాద‌ల‌తోనే ఆమె పేరు ఎక్కువ‌గా వినిపిస్తుంది. గల్ఫ్ అనే సినిమాతో కెరీర్ ప్రారంభించిన డింపుల్, గద్దలకొండ గణేష్, ఖిలాడి, రామబాణం లాంటి చిత్రాల్లో నటించింది. అయితే ఆ అన్ని చిత్రాలు ఘోర పరాజయాలను మూటగట్టుకున్నాయి. హిందీ, తమిళ భాషల్లో కూడా సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఈ వివాదం నేపథ్యంలో నెటిజన్లు డింపుల్ వ్యక్తిగత జీవితంపై ఆసక్తి చూపుతున్నారు. ఆమె భర్త ఎవరు? పెళ్లి ఎప్పుడైంది? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి. గతంలో ఆమెతో కలసి ఉన్న వ్యక్తిని “ఫియాన్స్”గా పిలిచినా, వివాహం జరిగిందా అన్న దానిపై స్పష్టత లేదు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *