Weather Update: తెలుగు రాష్ట్రాలకు మరో బిగ్ అలర్ట్.. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ!
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాయుగుండం బలపడి ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది.
/rtv/media/media_files/2024/12/28/P79l9qMKUUKCj6n1Qvuf.jpg)
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాయుగుండం బలపడి ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణతో పాటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఈ ఏరియాలో భారీ వర్షాలు..
ఇక హైదరాబాద్‌లోని కొన్ని ఏరియాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు నిండిపోయాయి. కొన్ని ప్రాంతాలు మునిగాయి. ఇప్పుడిప్పుడే కాస్త తేరుకున్నాయి. ఇంతలోనే మళ్లీ భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో మాదాపూర్, పంజాగుట్ట, యూసఫ్ గూడ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అమీర్ పేట్, సికింద్రాబాద్, చార్మినార్, అప్జల్ గంజ్, పఠాన్ చెరువు, మియాపూర్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, దుర్గం చెరువు, మణికొండ, అల్వల్, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. ఏపీలో ఉత్తరాంధ్రతో పాటు గుంటూరు, కడప, విజయవాడ, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.