Dasara 2025: దసరా బంపరాఫర్.. హైదరాబాద్ లో మటన్ కేవలం రూ.400.. ఏ ఏరియాలో అంటే?
తెలంగాణలో పండగయినా, పెళ్లయినా, చుట్టాలొచ్చినా మాంసం లేనిదే ముద్ద దిగదు. కానీ కిలోమాంసం రూ..1000 పెట్టి కొనాలంటే మధ్యతరగతి వారికి తలకు మించిన భారమే. అయితే హైదరాబాద్ లోని కొన్ని మేకల మండిలు తక్కువ ధరకు మాంసం అమ్ముతూ మాంసం ప్రియులను ఆకర్షిస్తున్నాయి.
/rtv/media/media_files/2025/10/01/mandi-goat-market-2025-10-01-13-50-40.jpg)
తెలంగాణలో పండగయినా(Dasara 2025), పెళ్లయినా, చుట్టాలొచ్చినా, దోస్తులొచ్చినా మాంసం లేనిదే ముద్ద దిగదు. అలాంటిది నలుగురు ఇంటికొస్తే రెండు కిలోల మాంసం అయినా తీసుకోవాలి. మధ్యతరగతి వారికి ఇది తలకు మించిన భారమే అవుతుంది. ఆర్థిక స్థోమత ఉన్నవారు మటన్ తెచ్చుకుని విందు కానిస్తే , లేనివారు చికెన్‌తో సరిపెట్టుకుంటున్నారు.ఒకప్పుడు చికెన్ ధరతో సమానంగా ఉండే మటన్.. ఇప్పుడు సామాన్యులు కొనలేని పరిస్థితికి చేరింది. ప్రస్తుతం తెలంగాణ పల్లెల్లో కిలో మేక మాంసం రూ.800కు పైగా ఉండగా.. హైదరాబాద్ నగరంలో అయితే రూ.1000 నుంచి రూ.1200 వరకు ఉంది. పండుగ సమయంలో ఈ ధర మరింత ఎక్కువగా ఉంటోంది.
Dasara Offer – Mutton Rs.500/- Only
ఈ అధిక ధరల వల్ల మధ్యతరగతి ప్రజలు మటన్ తినాలంటే కష్టమే. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లోని కొన్ని మేకల మండిలు మాంసం ప్రియులకు కొత్త ఆశలను రేకెత్తి్స్తున్నాయి. వాటిలో చెంగిచెర్ల మార్కెట్,జియాగూడ మార్కెట్, గోల్నాక మార్కెట్ ప్రసిద్ధి గాంచినవి. ఇక్కడ మేక మాంసాన్ని తక్కువ ధరకు అందిస్తున్నాయి. హైదరాబాద్ శివారులోని మేడ్చల్ జిల్లా, మేడిపల్లి మండలం పరిధిలో ఉన్న చెంగిచెర్లలో ఉన్న మేకల మార్కెట్ (మండి) రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతి రోజు వందల సంఖ్యలో మేకలను అమ్ముతుంటారు. మరోవైపు వందలాది మేకలను కట్ చేసి.. మార్కెట్లో తక్కువ ధరకే మాంసం అమ్ముతుంటారు. నగరంలోని ఇతర మార్కెట్లతో పోల్చితే.. ఇక్కడ మటన్ ధర సగమే ఉంటుంది. కిలో మేక మాంసం కేవలం రూ.500 నుంచి రూ.600 మధ్యలోనే లభిస్తుంది. ఎక్కువ మోతాదులో తీసుకుంటే రూ.400 నుంచి రూ.350 కిలో ఇచ్చేవాళ్లు కూడా ఉన్నారు.
ఇక్కడ మటన్ ఒక్కటే కాదు.. లివర్, బోటీ, కాళ్లు, తలకాయ ఇలా మేకకు సంబంధించిన అన్ని రకాల మాంసం కూడా లభిస్తోంది. ఇక్కడ బోటీ ధర కిలో రూ.150లకే దొరుకుతుంది. ఇక్కడి నుంచి మటన్ తీసుకొని వెళ్లడానికి దూర ప్రాంతాల నుంచి కూడా వినియోగదారులు వస్తుంటారు. ఏదైనా వేడుకలు చేసుకునే వారికి ఇది మంచి మార్కెట్. ఇక్కడ మగ మేక మాంసం కిలో రూ.500 నుంచి రూ.600 ఉంటే ఆడమేక మాంసం 400 నుంచి 500 వరకు ఉంటుంది. ఇక లైవ్ మేకను కొని పదికిలోల వరకు తీసుకుంటే కిలో రూ.350 వరకు కూడా ఇచ్చేవారున్నారు. ఈ మార్కెట్లలో మనం కోరుకున్న మేకను మన కళ్లముందే వధించి దాని మాంసాన్ని ఇస్తారు. కనుక అనుమానాలకు తావులేదు. కనుక ఈసారి ఏదైనా పండుగొచ్చినా, ఇంటికి చుట్టాలొచ్చినా భయపడకంటి చెంగిచర్ల, గోల్నాక, జియాగూడలో వాలిపోండి అంతే..