Allu Aravind: ఇక్కడ ఎవరి కుంపటి వారిదే..అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినీ పరిశ్రమను ఉద్దేశించి బడా నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఎవరి కుంపటి వారిదే అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏడు జాతీయ అవార్డులు వచ్చినా ఎవరూ స్పందించలేదని అల్లు విమర్శించారు.
తెలుగు సినీ పరిశ్రమలో అల్లు అరవింద్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అల్లు రామలింగయ్య కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా…పెద్ద నిర్మాతగా సక్సెస్ అయ్యారు. చిరంజీవి బావమరిది అవడం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ వల్ల ఆయనకు మరింత పేరు వచ్చింది. అల్లు అరవింద్ తాలూకా గీత ఆర్ట్స్ నుంచి పెద్ద పెద్ద సినిమాలు విడుదల అవుతాయి. దాదాపు అన్నీ హిట్ లుగానే నిలుస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో అల్లు అరవింద్ తెలుగు సిని పరిశ్రమ మీద తన అసహనాన్ని ఎక్కువగానే వ్యక్తపరుస్తున్నారు.
ఎవరి కుంపటి వారిదే..
తాజాగా నిన్న మళ్ళీ అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ అవార్డుకు ఎంపికైన వారిని సత్కరించకపోవడంపై అరవింద్ అసహనం వ్యక్తం చేసారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎవరి కుంపటి వారిదే నంటూ అల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైమా బృందం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సైమా మాత్ర స్పందిచి అవార్డు విజేతలను సత్కరించడం బావుందని ఆయన అభినందించారు.
రెండేళ్ళ క్రితం..
ఒకప్పుడు తెలుగు సినిమాకు ఒకటి, రెండు జాతీయ అవార్డులు రావడమే చాలా కషటంగా ఉండేది. కానీ ఈ ఏడాది ఏకంగా ఐడు అవార్డులు వచ్చాయి. ఇది మనం నిజంగా సండుగలా జుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఎవ్వరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక్కడ ఎవరి కుంపటి వారిదే అంటూ అల్లు అరవింద్ విరుచుకుపడ్డారు. ఇలా ఉండడం వల్లనే తెలుగు సినిమా అభిృద్ధికి సంబంధించి మంచి పనులు చేయలేకపోతున్నామని అన్నారు. అల్లు అరవింద్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఎవర్ని ఉద్దేశించీ మాటలు అన్నారో అంటూ చర్చిస్తున్నారు.
అయితే అల్లు అరవింద్ మాటల వెనుక ఆగ్రహం ఇప్పటిది కాదని అంటున్నారు. రెండేళ్ళ క్రితం పుష్ప సినిమాకు అల్లు అర్జున్ కు జాతీయ అవార్డ్ వచ్చింది. దాంతో పాటూపది జాతీయ పురస్కాలు కూడా వచ్చాయి. ఆ సమయంలో కొంత మంది అల్లు అర్జున్ ను అభినందించారు. కానీ ఎలాంటి సత్కారాలు లాంటివి మాత్రం జరగలేదు. అల్లు అరవింద్ దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పడు ఆగ్రహం వ్యక్తం చేశారని టాక్ నడుస్తోంది.
ఇక 2023 ఏడాదికిగాను ఇటీవలే 71వ జాతీయ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తంగా తెలుగు సినిమాకు ఏడు అవార్డుల వరించాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా `భగవంత్ కేసరి` నిలిచింది. `బలగం` సినిమాలోని పాటకి కాసర్ల శ్యామ్ ఉత్తమ లిరిసిస్ట్ అవార్డు రాగా, `బేబీ` చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే, `హనుమాన్` చిత్రానికి ఉత్తమ యానిమేషన్ – విజువల్ ఎఫెక్ట్స్ లో అవార్డులు దక్కాయి.