Health Tips: రాత్రి 7 గంటల తర్వాత డిన్నర్ చేస్తున్నారా.. అయితే ఒక్కసారి ఈ ఆర్టికల్ చదవండి

 Health Tips: రాత్రి 7 గంటల తర్వాత డిన్నర్ చేస్తున్నారా.. అయితే ఒక్కసారి ఈ ఆర్టికల్ చదవండి

రాత్రి 7 గంటల తర్వాత డిన్నర్ చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అజీర్ణం, అసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. అలాగే మలబద్ధకం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల చాలా మంది రాత్రిపూట ఆలస్యంగా తింటున్నారు. పూర్వ కాలంలో 6 గంటలకు భోజనం చేసి తొందరగా నిద్రపోయేవారు. కానీ ప్రస్తుతం రోజుల్లో నిద్ర, ఆహారం రెండు కూడా సరైన సమయానికి తీసుకోవడం లేదు. దీంతో ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే రాత్రి 7 గంటల్లోగా భోజనం చేయకుండా ఆలస్యంగా చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

జీర్ణవ్యవస్థ దెబ్బతినడం..

రాత్రి 7 గంటల తర్వాత ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీర్ణవ్యవస్థ దెబ్బతినడం, అసిడిటీ, వాంతులు, కడుపులో నొప్పులు, అలసట, నిరాశ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. అలాగే శరీరంలోని మెటబాలిజం మందగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు కూడా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మధుమేహం, ప్రీ డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే గుండె పోటు, బీపీ, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి రాత్రిపూట తొందరగా తినడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.

దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని..

రాత్రి భోజనం ఆలస్యంగా కాకుండా 7 గంటల లోపల చేయడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీరు తిన్న ఆహారం ఈజీగా జీర్ణం అవుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా గుండె పోటు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు రావని నిపుణులు అంటున్నారు. చాలా మంది ఈ రోజుల్లో బిజీ షెడ్యూల్ వల్ల ఆలస్యంగా తింటున్నారు. దీనివల్ల చిన్న వయస్సులోనే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు రాత్రి సమయాల్లో ఆలస్యంగా బిర్యానీ, పిజ్జా వంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటిని అర్థరాత్రి వేళలో తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు చాలా మంది వీటినే తీసుకుంటున్నారు. టిఫిన్, డిన్నర్, లంచ్ వంటివి తీసుకుంటున్నారు. వీటిలో ఎక్కువగా మసాలా, మైదా వంటివి ఉంటాయి. ఇవి శరీర సమస్యలను పెంచుతాయి. ఎలాంటి పోషకాలు కూడా ఇందులో ఉండవు. వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఉబకాయం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *