Electricity Big Alert: హైదరాబాద్‌లో నేడు ఆ ఏరియాల్లో విద్యుత్ సరఫరా బంద్..
హైదరాబాద్‌లోని పలు కాలనీలకు విద్యుత్ శాఖ బిగ్ అలెర్ట్ ప్రకటించింది. సాంకేతిక మరమ్మతుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. మహేష్ నగర్, ఎంజే కాలనీ ఫీడర్‌ల పరిధిలో విద్యుత్ కోత విధించనున్నారు.
Electricity Big Alert : హైదరాబాద్‌లోని పలు కాలనీలకు విద్యుత్ శాఖ బిగ్ అలెర్ట్ ప్రకటించింది. సాంకేతిక మరమ్మతుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తన్నట్లు తెలిపింది. నగరంలోని మహేష్ నగర్, ఎంజే కాలనీ ఫీడర్‌ల పరిధిలో బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నట్లు ఏఈ వేముల గంగాభవాని తెలిపారు. మహేష్ నగర్ మార్కెట్ రోడ్, పరివార్ బ్యాక్ సైడ్, సీపీఎం ఆఫీస్ ,వాటర్ ట్యాంక్ ఏరియా తదితర ప్రాంతాలలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, గాయత్రీనగర్ రోడ్ నెం-6,7,8,9,10, ఎంజే కాలనీ రోడ్ నం-1,2,3, గ్జేవియర్ స్కూల్ ఏరియా, కుర్మ హోమ్స్ ,ఎల్‌ఐజి-బి, శ్రీరాంనగర్, సాయిబాబా గుడి ప్రాంతం, తదితర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని ఆమె వివరించారు.
ఇక ఆజామాబాద్ డివిజన్ పరిధిలో ఐఈ పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ప్రివెంటివ్ మెడిసిన్ పరిధిలో 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు.
వీటితో పాటు టీఎస్ఎస్పీడీసీఎల్ సరూర్‌నగర్ డివిజన్ పరిధిలోని 11కేవీ ఆటోనగర్ ఇండస్ట్రీయల్, చాణక్యపురి, హుడాసాయినగర్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాలలో విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ తెలిపారు. 11కేవీ ఆటోనగర్ ఇండస్ట్రీయల్, హుడాసాయినగర్, చాణక్యపురి ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో మధ్యాహ్నం 12గంటల నుంచి 1గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆయన తెలిపారు. ఆయా సమయాలను వినియోగదారులు గుర్తించి తమ పనులు చేపట్టుకోవాలని అధికారులు సూచించారు.