ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్ ఫిల్మ్స్ 99వ చిత్రాన్ని విశాల్ కథానాయకుడిగా ప్రారంభించింది. దుషార విజయన్ హీరోయిన్గా నటించనుండగా, రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం చెన్నైలో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి కార్తి, జీవా, వెట్రిమారన్, శరవణ సుబ్బయ్య తదితరులు హాజరయ్యారు. విశాల్‌కు ఇది 35వ చిత్రం కాగా, 45 రోజుల సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తిచేయనున్నారు. జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సూపర్‌గుడ్ సంస్థ 100వ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.